రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే.. ఊహించని లాభాలు మీ సొంతం!
లవంగాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పడుకునే ముందు ఓ లవంగం మొగ్గను తినడం లేదా లవంగ నీటిని తాగడం వల్ల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయట. అంతేకాదు ఇది జీర్ణవ్యవస్థ పనితీరును..

లవంగాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పడుకునే ముందు ఓ లవంగం మొగ్గను తినడం లేదా లవంగ నీటిని తాగడం వల్ల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయట. అంతేకాదు ఇది జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం వంటి సాధారణ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక లవంగాన్ని తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
రాత్రి పడుకునే ముందు లవంగాలు తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది నోటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ కె వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్లు, యూజినాల్ వంటి ముఖ్యమైన కార్బన్ సమ్మేళనాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేద నిపుణులు రాత్రి పడుకునే ముందు లవంగాలు తినాలని సిఫార్సు చేస్తున్నారు.
ఒత్తిడి అదుపు
లవంగాలు మనస్సును ప్రశాంతపరిచే సహజ పదార్థాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మంచి నిద్ర వస్తుంది. లవంగాలలోని ఔషధ గుణాలు శరీరం నుంచి విషాన్ని సులభంగా తొలగించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఇవి ఉపశమనం కలిగిస్తాయి. వాటిలోని వేడి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలను త్వరగా తొలగిస్తాయి.
నోటి దుర్వాసన
లవంగాలను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతే కాదు ఇది పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కూడా అందిస్తుంది. లవంగాల రసం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లవంగాలను తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








