IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. పట్టు బిగించిన న్యూజిలాండ్.. భారీ ఆధిక్యం దిశగా..

బెంగళూరు టెస్టుపై న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది. మొదట భారత్ ను తక్కువ స్కోరుకే కుప్పుకూల్చిన పర్యాటక జట్టు ప్లేయర్లు ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రెచ్చిపోయారు. ఫలితంగా మొదటి టెస్టులో కివీస్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.

IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. పట్టు బిగించిన న్యూజిలాండ్.. భారీ ఆధిక్యం దిశగా..
India Vs New Zealand
Follow us

|

Updated on: Oct 17, 2024 | 6:04 PM

భారత్ తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్ జట్టు గట్టి పట్టు సాధించింది. రెండో రోజు మ్యాచ్‌లో విజృంభించిన న్యూజిలాండ్ బౌలర్లు టీమిండియాను కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేశారు.ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు సాధించారు. ఫలితంగా రెండో రోజు ముగిసే సమయానికి కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగుల ఆధిక్యం సాధించింది. రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర 22 పరుగులు, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజలో ఉన్నారు. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు. వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య తొలి రోజు ఆట టాస్ లేకుండానే ముగిసింది. దీంతో రెండో రోజు మ్యాచ్ 15 నిమిషాల ముందే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ కేవలం 10 ఓవర్లలోనే రోహిత్ శర్మ నిర్ణయం తప్పని రుజువైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్ప కూలింది. జట్టులోని 11 మంది ఆటగాళ్లందరూ కలిపి 50 పరుగులు కూడా చేయలేకపోయారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ టీమ్ ఇండియా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):

టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

భారత్ ను ఆ ఇక వరుణ దేవుడే కాపాడాలి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..