Hyderabad: గచ్చిబౌలిలో రూ. 26 లక్షలకే ఫ్లాట్లు.. హైదరాబాదీలకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్..
సొంత ఇంటి కల అనేది అందరికీ ఉంటుంది. కొందరు తమ శాలరీ తక్కువైనా సరే.. ఈఎంఐలు పెట్టి మరీ సొంత ఇల్లు కొనాలని అనుకుంటున్నారా.. అయితే మీకోసమే ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చాం. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

తెలంగాణ హౌసింగ్ బోర్డు(టీహెచ్‌బీ) తక్కువ ఆదాయ వర్గాల ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరాల్లోని లో ఇన్‌కమ్ గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీలోకి వచ్చే మొత్తం 339 ఫ్లాట్లను అమ్మకానికి సిద్ధం చేస్తోంది. గతంలో ప్రైవేట్ డెవలపర్లతో కలిసి జాయింట్ వెంచర్ విధానంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన తెలంగాణ హౌసింగ్ బోర్డు, ఆ ప్రాజెక్టుల్లో ప్రభుత్వానికి వచ్చిన వాటా ఫ్లాట్లను ఇప్పుడు ప్రజలకు విక్రయించనుంది.
ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు..
హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో 102 ఫ్లాట్లు, ఖమ్మం శ్రీరామ్ హిల్స్‌లో 126 ఫ్లాట్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకునేవారికి వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు(నెలకు రూ.50 వేలలోపు) ఉండాలి. ఫ్లాట్ల పరిమాణం 450 నుంచి 650 చదరపు అడుగుల మధ్య ఉంటుంది. ధరల విషయానికి వస్తే.. గచ్చిబౌలిలో ఫ్లాట్ల ధరలు రూ.26 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు, వరంగల్‌లో రూ.19 లక్షల నుంచి రూ.21.50 లక్షల వరకు, ఖమ్మంలో అత్యల్పంగా రూ.11.25 లక్షల వద్ద ప్రారంభమవుతాయి.
లాటరీ విధానంలో కేటాయింపు..
ఆసక్తి ఉన్న అర్హులైన దరఖాస్తుదారులు జనవరి 3వ తేదీలోపు ఆన్‌లైన్‌లో లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్లాట్ల కేటాయింపు లాటరీ విధానంలో జరగనుంది. గచ్చిబౌలిలో జనవరి 6న, వరంగల్‌లో జనవరి 8న ఖమ్మంలో.. జనవరి 10న లాటరీ నిర్వహించనున్నారు. ఈ 339 ఫ్లాట్ల విక్రయంతో హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని హౌసింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వీపీ గౌతమ్ తెలిపారు. ఫ్లాట్ల వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tghb.cgg.gov.in ను సందర్శించవచ్చు.
ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








