Actor : ఆ పెద్ద డైరెక్టర్ పిలిచి మోసం చేశాడు.. రూ.5 కోట్లు నష్టపోయాను.. టాలీవుడ్ హీరో..
సినీపరిశ్రమలో గుర్తింపు రావడం అంత సులభమేమి కాదు. అలాగే ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశం సక్సెస్ అయిన తారలు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో తొలి చిత్రంతోనే హిట్ అందుకున్నాడు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ అలియాస్ శ్రీనివాస్. కానీ ఫస్ట్ మూవీ హిట్ తర్వాత తనకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, సినిమాలు ప్లాప్ కావడం.. రాజకీయ కారణాలతో తన కెరీర్ దెబ్బతిన్నదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం పరిశ్రమలో రెండో ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ రోజుల్లో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు శ్రీ (శ్రీనివాస్), ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. 2012లో విడుదలైన ఈ రోజుల్లో విజయం తర్వాత సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, కథల ఎంపికలో పొరపాట్లు, అలాగే పరిశ్రమలో చోటు చేసుకున్న కొన్ని రాజకీయాల కారణంగా తన కెరీర్ దెబ్బతిన్నదని శ్రీ వెల్లడించారు.
ఫస్ట్ మూవీ తర్వాత మూడేళ్లల్లో దాదాపు 12 సినిమాలు చేసినప్పటికీ అవన్నీ విజయం సాధించలేదని అన్నారు. గత కొన్నేళ్లుగా పరిశ్రమకు దూరంగా ఉన్న శ్రీ, ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల తన యంత్రాలు పాడై రూ. 4-5 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితి నుండి ఒక అభిమాని ఆటో చార్జీలు చెల్లించడం వంటి సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ మారుతి తనను తన చిత్రాలకు ఎప్పుడూ పిలవలేదని, తాను అడగలేదని అన్నారు. ఇప్పుడు సెకండ్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఏ పాత్రకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.
మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కొంతమంది రాజకీయాలు చేసి తనను ఎదగనీయకుండా తొక్కేశారని, దానికి కారణమైన వ్యక్తుల గురించి తనకు తెలుసని అన్నారు. గత 9-12 సంవత్సరాలుగా పరిశ్రమకు దూరంగా ఉన్న కాలంలో శ్రీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా తన యంత్రాలు పాడై దాదాపు రూ. 4-5 కోట్ల విలువైన నష్టం వాటిల్లిందని తెలిపారు. ఒకానొక సందర్భంలో గచ్చిబౌలి నుండి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఆటో చార్జీలకు కూడా డబ్బులు లేక నడిచి వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో ఒక అమ్మాయి తనను గుర్తించి ఆటో చార్జీలు చెల్లించిందని వివరించారు. అలాగే, ఒక పెద్ద దర్శకుడు రాత్రి 10:30 గంటలకు కాల్ చేసి ఉదయం 6 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీకి షూటింగ్‌కు రమ్మంటే, రూమ్ తీసుకోకుండా కారులోనే పడుకున్నానని, అయితే చివరికి షూటింగ్ జరగలేదని తెలిపారు. సెకండ్ లీడ్ అయినా, అన్న పాత్ర అయినా, విలన్ పాత్ర అయినా ఏ పాత్ర చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తనకు అరేంజ్డ్ మ్యారేజ్ అయిందని, తన భార్య గృహిణి అని, పిల్లలు లేరని, ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని శ్రీ తెలిపారు. తాను ఎప్పుడూ ఎవరితోనూ టచ్‌లో ఉండనని, అది అహంకారం కాదని, ప్రాథమికంగా తనకు స్నేహితులను నిర్వహించడం, ఒక సర్కిల్‌లో ఉండటం వంటివి ఇష్టం ఉండవని అన్నారు. పని, ఇల్లు తప్ప తనకు ఇతర వ్యాపకాలు ఏమీ ఉండవని చెప్పారు. తన రెండో ఇన్నింగ్స్‌లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని శ్రీ తెలిపారు.

Srinivas
ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..




