Virat Kohli: కోహ్లీ నుంచి స్పెషల్ గిఫ్ట్.. కట్‌చేస్తే.. కొడుకుకు ఇచ్చిన స్టార్ ప్టేయర్.. అదేంటంటే?
Virat Kohli's Signed Jersey: ఛాంపియన్స్ ట్రోఫీకి విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మూడో వన్డేలో కింగ్ కోహ్లీ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే, ఓ ఇంగ్లండ్ మాజీ ప్లేయర్‌కు విరాట్ కోహ్లీ నుంచి ఊహించని గిఫ్ట్ అందింది. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Virat Kohli’s Signed Jersey: విరాట్ కోహ్లీ కీర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కింగ్ కోహ్లీ క్రేజ్ రోజురోజుకూ పెరగుతూనే ఉంది. ఈ క్రమంలో తమ అభిమాన ఆటగాళ్ళ నుంచి ఏమైదనా అందుకుంటే, వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా, కెవిన్ పీటర్సన్‌కు ఇలాంటి అనుభూతే కలిగింది. విరాట్ కోహ్లీ నుంచి ఒక జెర్సీని అందుకున్నాడు. అది తన కొడుకుకు బహుమతిగా ఇచ్చి, ఆశ్చర్యపరిచాడు. ఈ జెర్సీ ప్రత్యేకత ఏమిటంటే దానిపై కోహ్లీ సంతకం ఉందన్నమాట.
కెవిన్ పీటర్సన్ ఇండియా, ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కోహ్లీ నుంచి జెర్సీని అందుకున్నాడు. అలాగే, ఈ జెర్సీపై కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసి, అందించాడు. కెవిన్ దీన్ని తన కొడుకు డిలన్‌కి ఇచ్చాడు. తన కొడుకు జెర్సీతో నిలబడి ఉన్న ఫొటోలను కెవిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
View this post on Instagram
కెవిన్ పీటర్సన్, విరాట్ కోహ్లీ మధ్య మంచి అనుబంధం ఉంది. వారిద్దరూ 2009-10 సమయంలో RCBలో కలిసి ఆడారు. ఈ క్రమంలో వారిద్దరు కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. ఈ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. కోహ్లీ జెర్సీ అందుకున్న తర్వాత కెవిన్ కొడుకు మరింత సంతోషంగా ఉన్నాడంట.
ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతోంది. దీనికి ముందు, ఇంగ్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా గెలుచుకుంది. ఇది భారత జట్టుకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. వారు మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేశారు. తొలి మ్యాచ్ లోనే కోహ్లీ ఔటయ్యాడు. రెండవ మ్యాచ్‌లో అతను ఐదు పరుగులకే ఔటయ్యాడు. కానీ, మూడవ మ్యాచ్‌లో 52 పరుగులు చేశాడు. దీంతో అతను వన్డేల్లో 73 అర్ధ సెంచరీలు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ నుంచి ఎన్నో ఆశలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..