- Telugu News Photo Gallery Cricket photos Ishan Kishan became the 2nd Indian Wicket Keeper after MS Dhoni to record four consecutive ODI fifties in Pallekele on Saturday
IND vs PAK: ఎంఎస్ ధోని సరసన చేరిన ఇషాన్ కిషన్.. ఆ రికార్డుతో కేఎల్ రాహుల్‌కు చెక్ పెట్టేసిన లెఫ్ట్ హ్యాండర్..
IND vs PAK, Asia Cup 2023, Ishan Kishan: ఇషాన్ కిషన్ వన్డేల్లో వరుసగా నాలుగో అర్ధశతకం సాధించాడు. అంతకుముందు, అతను వెస్టిండీస్ పర్యటనలో వరుసగా 3 వన్డేల్లో 52, 55, 77 పరుగులు చేశాడు. తొలిసారి పాక్‌తో వన్డే ఆడుతూ అర్థ శతకం బాదేశాడు. తన వన్డే కెరీర్‌లో 7వ హాఫ్ సెంచరీ కొట్టేశాడు.
Updated on: Sep 02, 2023 | 8:53 PM

భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వన్డేల్లో వరుసగా నాలుగో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఆసియా కప్ 2023 శనివారం పల్లెకెలెలో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ 82 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 48 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాకు తన కీలక ఇన్నింగ్స్‌తో ఊపిరి పోశాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి సెంచరీ భాగస్వామ్యంతో స్కోర్‌ను 200 దాటించడడంలో సఫలమయ్యాడు.

ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌లో భారత బ్యాకప్ ఓపెనర్‌గా పేరుగాంచిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు, ODIలలో తన మొదటి ఇన్నింగ్స్‌లో ఐదవ స్థానంలో బరిలోకి దిగి విమర్శకులకు తగిన సమాధానం అందించాడు. గాయంతో అవుట్ అయిన ఫస్ట్-ఛాయిస్ కీపర్ కేఎల్ రాహుల్ స్థానంలో ఆడాడు.

కిషన్ కేవలం 54 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. కిషన్ తిమ్మిరితో బాధపడుతూ గేర్లు మార్చడానికి ప్రయత్నించాడు. సెంచరీకి చేరువైన క్రమంలో 81 బంతుల్లో 82 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

వెస్టిండీస్‌పై ఇటీవల వరుసగా మూడు అర్ధసెంచరీల చేసిన నేపథ్యంలో 25 ఏళ్ల ఆటగాడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోని తర్వాత వరుసగా నాలుగు వన్డే అర్ధ సెంచరీలు నమోదు చేసిన రెండవ భారత వికెట్ కీపర్‌గా కిషన్ నిలిచాడు.

కిషన్ 17 ODI ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ (బంగ్లాదేశ్‌పై రికార్డు బద్దలు కొట్టడం 210), ఆరు అర్ధసెంచరీలతో 750కి పైగా పరుగులు చేశాడు.





























