IND Vs PAK: మాస్ జాతర ఇది.. 16 సిక్సర్లు, 74 ఫోర్లతో 711 పరుగులు.. మెంటలెక్కించేశారోయ్ బుల్లోడా.!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇండియా, పాకిస్తాన్ జట్లు అదరగొడుతున్నాయి. ఒకే రోజు రెండు జట్లకు జరిగిన వన్డే మ్యాచ్ లలో రెండు జట్ల బ్యాటర్లు బ్యాట్ తో దుమ్ములేపారు. మరి ఇంతకీ ఈ జట్లు ఎంత స్కోర్ చేశాయి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. అయితేనేం ఈ మ్యాచ్ కంటే ముందే.. రెండు జట్లు తమ ప్రతాపాన్ని చూపించాయి. ఒకే రోజు జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా కలిసి 711 పరుగులు సాధించాయి. వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, వేర్వేరు జట్లపై ఈ ఫీట్ సాధించాయి. అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ చేస్తే.. కరాచీలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి భారీ స్కోర్ సాధించింది పాకిస్తాన్. దీంతో భారత్, పాకిస్తాన్ ఈ రెండు మ్యాచ్‌లలో మొత్తంగా 16 సిక్సర్లు, 74 ఫోర్లు బాదేశాయి.
భారత్-పాకిస్తాన్ ‘711 పరుగులు’..
అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో భారత్ 356 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 36 ఫోర్లు కొట్టింది. ఇక దక్షిణాఫ్రికాపై 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్ 6 సిక్సర్లు, 38 ఫోర్ల సాయంతో మొత్తం 355 పరుగులు చేసింది. ఈ విధంగా, ఒకే రోజు జరిగిన మ్యాచ్‌లో భారత్ మరియు పాకిస్తాన్ 16 సిక్సర్లు మరియు 74 ఫోర్ల సహాయంతో మొత్తం 711 పరుగులు సాధించాయి.
కరాచీలో పాకిస్తాన్..
పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 707 పరుగులు నమోదయ్యాయి, ఈ రెండు జట్లు నమోదు చేసిన సరికొత్త రికార్డు. కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌కు 353 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి పాక్ జట్టు గట్టిగానే స్పందించింది. పాకిస్తాన్ తరపున మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా అద్భుతమైన సెంచరీలు సాధించారు. రిజ్వాన్ 122 పరుగులు చేయగా, సల్మాన్ 134 పరుగులు చేశాడు. ఈ రెండు సెంచరీల సాయంతో పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది.
అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన భారత్..
అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక భారత్ నిర్దేశించిన 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించలేకపోయింది. 214 పరుగులకు ఆలౌట్ అయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..