Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2025: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ లైవ్‌ ఎందులో చూడాలంటే..? పూర్తి వివరాలు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నేటి నుంచి అంటే ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఐదు జట్లు ఈ లీగ్ లో పాల్గొంటున్నాయి. మరి ఈ లీగ్ మ్యాచ్ లు ఎక్కడ చూడాలి? ఏ ఛానెల్లో లైవ్ వస్తుంది? ఏ యాప్ లో స్ట్రీమింగ్ అవుతంది? ఏ టైమ్ కి మ్యాచ్ లు షురూ అవుతాయి? పూర్తి వివరాలు మీ కోసం..

WPL 2025: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ లైవ్‌ ఎందులో చూడాలంటే..? పూర్తి వివరాలు
Wpl
Follow us
SN Pasha

|

Updated on: Feb 14, 2025 | 4:32 PM

ఐపీఎల్‌తో పోటీ పడుతూ.. సీజన్‌ సీజన్‌కి ఆదరణ పెంచుకుంటూ పోతున్న డబ్ల్యూపీఎల్‌(ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌) మూడో సెషన్‌ ఫిబ్రవరి 14 శుక్రవారంతో ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టీమ్స్‌ టైటిల్‌ వేట కోసం బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్‌ వడోదరాలో జరగనుంది. అలాగే ముంబై, బెంగళూరు, లక్నో వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి ఈ డబ్ల్యూపీఎల్‌ 2025 సీజన్‌ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి? ఏ ఛానల్‌లో లైవ్‌ వస్తోంది? ఏ ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్‌లోనూ 5 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి టీమ్‌ మిగతా టీమ్స్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. దీన్ని డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది.

ఇక రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడుతాయి. గెలిచిన జట్టు ఫైనల్‌కు, ఓడిన జట్టు ఇంటికి వెళ్తాయి. గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ఫిబ్రవరి 14 నుంచి మార్చ్‌ 11 వరకు జరుగుతాయి. మార్చ్‌ 13న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఉంటుంది. మార్చ్‌ 15న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. మొత్తంగా రాబోయే 30 రోజులు నాలుగు వేదికల్లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. వడోదరాలోని కొతాంబి స్టేడియం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, లక్నోలోని బీఆర్‌ఎస్‌ఏబీవీ ఎక్నా స్టేడియం, ముంబైలోని సీసీఐ బ్రాబోర్న్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో వారియర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఉమెన్‌ టీమ్స్‌ పాల్గొంటాయనే విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో భారత స్టార్‌ మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మ పాల్గొంటారు. మంధాన ఆర్సీబీకి, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ముంబైకి కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

గత సీజన్‌లో మంధాన కెప్టెన్సీలోని ఆర్సీబీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆర్సీబీ ఒక్క కప్పు కొట్టకపోయినా.. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రెండో సెషన్‌లోనే ఆర్సీబీ ఉమెన్స్‌ టీమ్‌ కప్పు కొట్టడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. అయితే భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ డబ్ల్యూపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ రైట్స్‌ను వియాకమ్‌18 దక్కించుకుంది. అయితే హాట్‌స్టార్‌, జియో మెర్జ్‌ కావడంతో స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో కూడా మ్యాచ్‌లు చూడొచ్చు. స్టార్‌ స్పోర్ట్స్‌ 1 ఛానెల్‌లో లైవ్‌ వస్తుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ యాప్‌ కూడా జియో హాట్‌స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ యాప్‌లో కూడా డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌లను లైవ్‌ చూడొచ్చు. ఇక వేరే దేశాల విషయానికి వస్తే. యూకేలో స్కై స్పోర్ట్స్‌, ఆస్ట్రేలియాలో ఫాక్స్‌ క్రికెట్‌, న్యూజిలాండ్‌లో స్కై స్పోర్ట్స్‌, అమెరికా, కెనడా లో విల్లో టీవీ, సౌతాఫ్రికాలో సూపర్‌ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌లు లైవ్‌ చూడొచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.