DC vs GT, IPL 2024: సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 17వ సీజన్ 40వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

DC vs GT, IPL 2024: సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
Delhi Capitals
Follow us

|

Updated on: Apr 24, 2024 | 11:36 PM

Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 17వ సీజన్ 40వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ పంత్‌ (88నాటౌట్), అక్షర్‌ పటేల్‌ (66) చెలరేగి ఆడి తమ జట్టుకు భారీ స్కోరు అందించారు. గుజరాత్‌ బౌలర్లలో వారియర్‌ మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఒత్తిడికి గురైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే సాయి సుదర్శన్‌ (65), మిల్లర్‌ (55) మెరుపు అర్ధశతకాలతో చెలరేగారు. గుజరాత్ ను మళ్లీ పోటీలోకి తీసుకొచ్చారు. ఇక ఆఖరులో రషీద్‌ ఖాన్‌ (11 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు, ఒక సిక్స్ ) మెరుపులు మెరిపించాడు. అయితే టార్గెట్ మరీ ఎక్కువ కావడంతో గుజరాత్ 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఢిల్లీ బౌలర్లలో రషిఖ్‌ 3, కుల్దీప్‌ 2, నోకియా 1, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్‌ తీశారు.

ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది నాలుగో విజయం కాగా, గుజరాత్ టైటాన్స్‌పై రెండో విజయం. అంతకుముందు ఏప్రిల్ 17న ఢిల్లీ గుజరాత్‌ను ఓడించింది.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

శరత్ BR, సాయి సుదర్శన్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్:

పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలాం, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్

భయపెట్టిన రషీద్ ఖాన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు