- Telugu News Photo Gallery Cinema photos Kiara Advani is playing the female lead in Yash's Toxic Movie
కియారా ఈసారి హిట్ కొట్టేనా..! యష్ సినిమాపై ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ భామ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది ఈ అందాల భామ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Updated on: Dec 22, 2025 | 9:59 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది ఈ అందాల భామ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఆతర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది.

చాలా కాలం తర్వాత తిరిగి రామ్ చరణ్ సినిమాతోనే టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై డబుల్ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది.

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. ఇటీవలే తల్లిగానూ ప్రమోషన్ అందుకుంది కియారా. బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది కియారా అద్వానీ. యష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుంది.

టాక్సిక్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యష్ హీరోగా నటిస్తుండగా.. కియారా హీరోయిన్ గా చేస్తుంది. అలాగే నయనతార ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని టాక్ వినిపించింది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.




