సాయంత్రం వేళల్లో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త..
చల్లని సాయంత్రాల్లో వేడి వేడిగా.. నోటికి రుచిగా ఉండే.. స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు. దాదాపు అందరికీ సాయంత్రాల్లో 5 నుంచి ఆరు గంటల మధ్య ఆకలితో ఉంటుంది. ఈ ఆకలి సాధారణంగా మనం ఆఫీసులో ఉన్నప్పుడు లేదా ఆఫీసు నుండి బయటకు వెళ్ళినప్పుడు వస్తుంది..
Updated on: Dec 22, 2025 | 8:38 PM

చల్లని సాయంత్రాల్లో వేడి వేడిగా.. నోటికి రుచిగా ఉండే.. స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు. దాదాపు అందరికీ సాయంత్రాల్లో 5 నుంచి ఆరు గంటల మధ్య ఆకలితో ఉంటుంది. ఈ ఆకలి సాధారణంగా మనం ఆఫీసులో ఉన్నప్పుడు లేదా ఆఫీసు నుండి బయటకు వెళ్ళినప్పుడు వస్తుంది.

ఆ సమయంలో రోడ్డు పక్కన ఏది దొరికితే అది తొందరపడి తినేస్తుంటారు. అయితే ఈ అలవాటు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సమయంలో తీసుకునే వేయించిన ఆహారాలు, తీపి ఆహారాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. రుచి పేరుతో జీర్ణక్రియ, జీవక్రియకు ఆటంకం కలిగించే ఈ విధమైన స్నాక్స్‌కి దూరంగా ఉండటమే మంచిది.

ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత సమోసాలు, జిలేబీలు, పానీపూరి, వడ పావ్, కచోరీ, వేయించిన మోమోలు, గోలీ భేల్ తినకూడదు.

రోజంతా డైటింగ్ చేస్తూ సాయంత్రం వేళల్లో అలాంటివి తీసుకుంటే ఇది ఖచ్చితంగా బరువు పెరగడానికి, కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ తినడానికి ప్రయత్నించండి.




