AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. బల్లులు తోకముడిచి పరుగులు పెట్టాల్సిందే.. అవేంటంటే..

Natural lizard control: ప్రతి ఇంట్లో బల్లులు ఉంటాయి. వాటిని చూడగానే ఇంట్లోని కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు భయపడిపోతారు. అవే కాదు కొన్ని సార్లు అవి మనం తినే పాత్రలపై తిరుగుతుంటాయి. వంటకాలు, నీటిలో కూడా పడుతుంటాయి. మనం వాటిని గమనించకుండా తింటే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని సార్లు ప్రాణాల మీదకే రావచ్చు. కాబట్టి వాటిని ఇంట్లోకి రానివ్వకుండా ఉండేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. కొన్ని మొక్కల వాసనలు వాటికి ఇబ్బందిని కలిగిస్తాయి. అలాంటి మొక్కలను మనం ఇంట్లో ఉంచుకుంటే.. బల్లులు ఆ పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఆ మొక్కలేవో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Dec 22, 2025 | 6:26 PM

Share
లావెండర్ మొక్క: లావెండర్ అనే మొక్క బల్లులను ఇంట్లో నుంచి తరిమికొట్టడంతో ఎంతో పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది. ఎందుకుంటే ఈ మొక్కలో బలమైన సువాసన గల లినాలూల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వాసన బల్లులకు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.  కాబట్టి మీరు దీన్ని మీ ఇంటి కిటికీలు, బాల్కనీలు, ఇంటి గుమ్మం దగ్గర ఉంచతే.. బల్లులు ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

1 / 5
తులసి మొక్క: మన అందరి ఇల్లలో ఉండే, అందరికీ తెలిసిన తులసి మొక్క కూడా వీటిని తరిమి కొట్టడంలో బాగా పనిచేస్తుంది. తులసికి ఉండే ఘాటైన, విలక్షణమైన వాసన బల్లులకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది బల్లులను ఇంట్లోకి రానివ్వకుండా చేయడమే కాకుండా.. దోమలు, ఇతర కీటకాలను కూడా ఇంట్లోంచి తరిమికొడుతుంది.  దీన్ని మీ వంటగది కిటికీలు, బాల్కనీలు, గుమ్మంలో కుండలలో పెట్టి ఉంచవచ్చు. ఈ మొక్క ఇంటిని సహజంగా రక్షించడమే కాకుండా పర్యావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది.

2 / 5
పిప్పరమింట్ మొక్క: పిప్పరమింట్ కూడా బలమైన వాసనను వెదజల్లే మొక్క.. ఇందులో ఉండే మెంథాల్ వాసన బల్లుల, సున్నితమైన ఇంద్రియాలకు చాలా అసహ్యకరంగా ఉంటుంది. కాబట్టి బాత్రూమ్ కిటికీలు లేదా వంటగది, వంటగది, హాల్‌లో ఈ మొక్కను కుండలో ఉంచి పెట్టండి. ఇది మీ ఇంట్లో బల్లులు, దోమలను రాకుండా అడ్డుకుంటుంది.

3 / 5
రోజ్మేరీ మొక్క: రోజ్మెరీ కూడా ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బల్లులు మాత్రమే కాదు, ఈగలు, దోమలు కూడా రోజ్మేరీ నుంచి వచ్చు  ఘాటైన వాసనను ఇష్టపడవు. కాబట్టి, ఈ మీ ఇంట్లో ఉండే బల్లులను తరిమికొట్టేందుకు మీరు రోజ్మేరీ మొక్కలను కుండీలలో నాటవచ్చు, వాటిని మీ ఇంటి బాల్కనీలు, కిటికీల దగ్గర ఉంచవచ్చు.

4 / 5
బంతి పువ్వు మొక్క: బంతి పువ్వు ఇది మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, ఇంట్లోకి బల్లులు, ఇతర కీటకాలు రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే బలమైన వాసన బల్లుల, ఇతర కీటకాలకు చీదర పుట్టిస్తుంది. కాబట్టి ఈ మొక్కను మీ ఇంట్లో ఉంచుకుంటే.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 / 5