- Telugu News Photo Gallery Spiritual photos 2026 Career Horoscope: Major Job Changes and Promotions for 6 Zodiac Signs
Career Astrology: 2026లో ఆ రాశుల వారు ఉద్యోగం మారడం ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా?
ఉద్యోగానికి సంబంధించిన కుజ, రవి, శుక్ర, గురు గ్రహాలు కొత్త సంవత్సరం ప్రథమార్థంలో స్థిర, ద్విస్వభావ రాశుల నుంచి చర రాశులకు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగాలు మారడమో, ఉద్యోగంలో మార్పులు రావడమో తప్పకుండా జరిగే అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి బదిలీలు, స్థాన చలనాలు, ఉద్యోగంలో మార్పు వంటి పరిణామాలకు ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఎక్కువగా మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది.
Updated on: Dec 22, 2025 | 6:04 PM

మేషం: రాశ్యధిపతి కుజుడు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మకర రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారు తప్పకుండా ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఉన్నత పదవి, భారీ జీతభత్యాలు లభించే ఉద్యోగానికి మారే సూచనలున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా స్థాన చలనం కలుగుతుంది. ఈ రాశివారికి కొద్దిప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభించడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో యాక్టివిటీ, డిమాండ్ వృద్ధి చెందుతాయి.

కర్కాటకం: కుజ, రవులు చర రాశుల్లోకి మారుతున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగం మారడానికి అనేక అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఫిబ్రవరి లోపు ఉద్యోగంలో మార్పు రాకపోయిన పక్షంలో మే తర్వాత గురువు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఉద్యోగం మార డానికి బాగా అవకాశం ఉంది. దూర ప్రాంత సంస్థలో మరింత మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. బదిలీకి కూడా అవకాశం ఉంది.

కన్య: మే తర్వాత ఈ రాశికి లాభ స్థానంలోకి గురువు ప్రవేశించి ఉచ్ఛపడుతున్నందువల్ల ఉన్నత పదవుల కోసం, భారీ జీతభత్యాల కోసం ఈ రాశివారు తప్పకుండా మరో ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. రాశ్యధిపతి బుధుడు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిత్ర క్షేత్రాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశివారు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా కొద్దిపాటి మార్పులతో యాక్టివిటీ పెరగడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి దశమ స్థానంలోకి ఉచ్ఛ గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారు ఉద్యోగం మారడా నికి, ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి, జీతభత్యాలు బాగా పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యో గులకే కాక, నిరుద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగు తుంది. బదిలీలు లేదా స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు చర రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగం మారడానికి, స్థాన చలనానికి బాగా అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ఇతర దేశాల సంస్థల నుంచి ఆహ్వానాలు అందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా అనేక పర్యాయాలు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. మే తర్వాత వీరు ఒక ఉద్యోగంలో, ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే అవకాశం లేదు.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారు మే తర్వాత తప్ప కుండా ఉద్యోగం మారే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి బాగా అవకాశం ఉంది. పదోన్నతులు, భారీగా జీతభత్యాల పెరుగుదల, కొత్త బాధ్యతలకు అవకాశం ఉన్న ఉద్యోగం లోకి మారే సూచనలున్నాయి. విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.



