- Telugu News Photo Gallery Cricket photos Olympic Legend Usain Bolt Named As Brand Ambassador For T20 World Cup 2024
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. అధికారికంగా ప్రకటించిన ఐసీసీ
ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ జరుగుతోంది. ఆ తర్వాత యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 2 నుంచి ఈ చుటుకు సమర ప్రారంభం కానుంది. తొలిసారిగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి.
Updated on: Apr 24, 2024 | 10:42 PM

ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ జరుగుతోంది. ఆ తర్వాత యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 2 నుంచి ఈ చుటుకు సమర ప్రారంభం కానుంది. తొలిసారిగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి.

అమెరికాలో క్రికెట్ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ఐసీసీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో తన స్పీడ్‌తో ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించిన జమైకా స్పీడ్‌స్టర్ ఉసేన్ బోల్ట్‌ను టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమించారు.

8 సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ఉసేన్ బోల్ట్ బుధవారం (ఏప్రిల్ 24) T20 ప్రపంచ కప్ 2024 కోసం అంబాసిడర్‌గా నామినేట్ అయ్యాడు.

అంబాసిడర్‌గా నామినేట్ అయిన తర్వాత బోల్ట్ మాట్లాడుతూ.. అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే టోర్నీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందన్నాడు.