సీసీటీవీ కెమెరా ఈ దిశలో ఉంటే మీ కొంప మునిగినట్టే.. పెట్టుకునే ముందు ఇవి తెలుసుకోండి..
ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు సాధారణమయ్యాయి. అయితే వాస్తు ప్రకారం వీటిని తప్పుడు దిశలో అమర్చడం వల్ల ఇంట్లో అశాంతి, ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఈశాన్య దిశ కెమెరాలకు శ్రేష్ఠమని నిపుణులు సూచిస్తున్నారు. ఏ దిశలలో సీసీటీవీలు పెట్టకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వ్యాపార సంస్థల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం కామన్‌గా మారింది. అయితే వీటిని ఎక్కడ పడితే అక్కడ అమర్చడం వల్ల వాస్తు దోషాలు కలిగే అవకాశం ఉందని మీకు తెలుసా? తప్పుడు దిశలో ఉంచిన కెమెరా మీ ఇంట్లో అశాంతికి, ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమెరాలు అమర్చేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఇవే..
ఈ దిశల్లో కెమెరాలు అస్సలు వద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆగ్నేయం , నైరుతి, పశ్చిమ లేదా వాయువ్య దిశలలో సీసీటీవీ కెమెరాలను ఉంచడం మంచిది కాదు. ఈ దిశల్లో కెమెరాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం, మానసిక ప్రశాంతత కరువవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
కెమెరాలకు ఈశాన్యం శ్రేష్ఠం
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సీసీటీవీ కెమెరాలను అమర్చడానికి ఈశాన్య దిశ అత్యంత అనుకూలమైనది. ఒకవేళ మీరు రెండు కెమెరాలను అమర్చినట్లయితే, అవి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇలా ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.
నైరుతిలో ఉంటే ఆర్థిక నష్టం
నైరుతి దిశలో కెమెరాలు అమర్చడం వల్ల భద్రత పెరగడానికి బదులు, దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాస్తు చెబుతోంది. అంతేకాకుండా అనవసరపు ఖర్చులు పెరిగి ఆర్థికంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.
వ్యాపార సంస్థల్లో జాగ్రత్తలు
గోడౌన్లు: గోడౌన్లలో నిఘా కోసం కెమెరాలను ఉత్తర లేదా తూర్పు దిశలలో ఉంచడం ఉత్తమం. ఇది భద్రతను పెంచడమే కాకుండా వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది.
వ్యాపార ప్రదేశాలు: ఆఫీసులు లేదా దుకాణాల్లో దక్షిణం లేదా నైరుతి దిశలో కెమెరాలను ఎప్పుడూ ఉంచకూడదు. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
టెక్నాలజీ ఏదైనా వాస్తుతో జోడిస్తేనే సంపూర్ణ ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మీ ఇంటి భద్రతతో పాటు సుఖసంతోషాల కోసం కెమెరాలను సరైన దిశలో అమర్చుకోండి.
(NOTE: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. వివిధ వాస్తు శాస్త్ర నిపుణుల ఆధారంగా అందించడం జరిగింది. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణులు లేదా మీ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి TV9 ఎటువంటి బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








