AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో వాము నీటితో వంద లాభాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Ajwain water: చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు వాము నీరు దివ్యౌషధం. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన ఈ చిట్కాను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది శ్వాసను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.

చలికాలంలో వాము నీటితో వంద లాభాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Ajwain Water Benefits
Krishna S
|

Updated on: Dec 22, 2025 | 9:46 PM

Share

చలి పెరగడం, కాలుష్యం కోరలు చాచడంతో ప్రస్తుతం ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఇంగ్లీష్ మందుల కంటే మన వంటింట్లో లభించే దేశీ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన వాము నీరు చలికాలపు అనారోగ్యాలకు రామబాణంలా పనిచేస్తుంది.

వాము నీరు ఎలా తయారు చేయాలి?

  • వాము నీటి తయారీ చాలా సులభం. దీన్ని ఇంట్లోనే 5 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు..
  • ఒక కప్పు నీటిని తీసుకుని బాగా మరిగించండి.
  • మరిగే నీటిలో ఒక టీస్పూన్ వాము వేయండి.
  • వాములోని ఔషధ గుణాలు నీటిలోకి దిగేలా 5 నుండి 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించండి.
  • ఆ తర్వాత నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

శ్వాసకోశ క్లీనర్: వాములోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళాల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని కరిగించి, శ్వాస తీసుకోవడం సులభతరం చేస్తాయి.

జీర్ణక్రియకు ప్రాణం: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు దూరమై జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తి: ఆయుర్వేదం ప్రకారం వాము నీరు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వాము నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి:

అతిగా వద్దు: వాము స్వభావం వేడి కాబట్టి అతిగా తాగితే కడుపులో మంట లేదా ఎసిడిటీ రావచ్చు. రోజుకు 1 లేదా 2 సార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

గర్భిణీలు – పిల్లలు: గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు వాము నీరు ఇచ్చే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

అసౌకర్యం కలిగితే: ఈ నీటిని తాగిన తర్వాత కడుపులో మంటగా అనిపిస్తే వెంటనే ఆపేయడం మంచిది.

ప్రకృతి ప్రసాదించిన ఈ సహజసిద్ధమైన నివారణను పాటిస్తూ చలికాలం వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..