AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది! ధర పెరుగుదలకు కారణం ఏంటంటే..?

గత ఏడాది రాగి ధరలు ఊహించని స్థాయి లో పెరిగి సరికొత్త రికార్డు లు సృష్టించాయి. బంగారం, వెండి లాభాలను మించి రాగి దూసుకుపోవడానికి పలు కారణాలున్నాయి. రాగి ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

SN Pasha
|

Updated on: Jan 16, 2026 | 7:10 PM

Share
కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల పెరుగుదల గురించే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ, వాటితో పాటు తాజాగా రాగి కూడా రెచ్చిపోతోంది. ఎలక్ట్రిక్ వైర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వరకు ప్రతి దాంట్లోనూ ఉపయోగించే రాగి ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2025లో మొదలైన రాగి ధరల పెరుగుదల 2026లో కూడా ఆగేలా కనిపించడం లేదు. ఇంకా మరింత వేగంగా దూసుకెళ్తోంది. 2025 జనవరి 1న ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో కిలో రాగి ధర సుమారు రూ.793 ఉండేది. కట్ చేస్తే సరిగ్గా ఏడాది తర్వాత అంటే జనవరి 2026 1 నాటికి రూ.1,292కి చేరింది.

1 / 5
జనవరి 15న మార్కెట్లో కిలో రాగి ధర రూ.1,325గా ఉంటే పలుకుతోంది. అంటే ఏడాదిలో దాదాపు 62 శాతం లాభాలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా టన్ను రాగి ధర 13,000 డాలర్లు దాటి చరిత్ర సృష్టించింది. ఏడాది కాలంలో బంగారం 76 శాతం లాభంతో రేసులో ముందున్నా, వెండి 169 లాభంతో ఆశ్చర్యపరిచినా, రాగి మాత్రం సైలెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే రాగి ధర పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2 / 5
అమెరికా 'టారిఫ్' టెన్షన్.. అమెరికా రాబోయే రోజుల్లో రాగి దిగుమతులపై 15 శాతం నుంచి 30 శాతం వరకు పన్నులు వేయబోతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అనే భయంతో అక్కడి కంపెనీలు ఇప్పుడే ఎగబడి కొని స్టాక్ పెట్టుకుంటున్నాయి. ఇదే ఇప్పుడు రేటు పెరగడానికి ప్రధాన కారణం.

3 / 5
గనుల్లో సమ్మెలు.. ప్రపంచంలో రాగి ఎక్కువగా దొరికే చిలీ లాంటి దేశాల్లోని గనుల్లో కార్మికుల సమ్మెలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాంటోవెర్డే గనిలో సమ్మె వల్ల రాగి సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది. సరఫరా తగ్గింది. ఇంకేముంది? రాగి రేటు ఆకాశన్నంటింది.

4 / 5
భవిష్యత్తు అవసరాలు.. ఎలక్ట్రిక్ కార్లు, 5G నెట్‌వర్క్‌లు, డేటా సెంటర్లు.. వీటన్నింటికీ రాగి ప్రాణం లాంటిది. ఈ టెక్నాలజీలు పెరుగుతున్న కొద్దీ రాగికి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది.

5 / 5