AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ నుంచి మరో శుభవార్త.. ఆ రైళ్లు పొడిగింపుపై నిర్ణయం

సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వేశాఖ పెద్ద మొత్తంలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా స్పెషల్ ట్రైన్లను తీసుకొచ్చింది. అయితే ఈ క్రమంలో రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. మరికొన్ని ప్రత్యేక సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Venkatrao Lella
|

Updated on: Jan 17, 2026 | 6:54 PM

Share
ప్రయాణికులకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ అందించింది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకున్న రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల మధ్య తిరుగుతున్న ప్రత్యేక సర్వీసులను మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
సంత్రగాచి-యోలహంకా(02863) రైలును జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు, యోలహంకా-సతంత్రగాచి(02864) రైలును ఈనెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించారు. ఇక షాలీమార్-చెన్నై(02841) రైలును ఫిబ్రవరి 2 నుంచి 23 వరకు పొడిగించారు.

2 / 5
చెన్నై సెంట్రల్-షాలీమార్(02842) రైలును ఫిబ్రవరి 4 నుంచి 25వ తేదీ వరకు సర్వీసులు అందించనుంది. ఇక కాకినాడ-మైసూర్(07033) ఫిబ్రవరి 2 నుంచి 27వ తేదీ వరకు. మైసూర్-కాకినాడ(07034) ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు పొడిగించారు. ఇక నర్సాపూర్-బెంగళూరు(07153) ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు అందుబాటులో ఉండనుంది.

3 / 5
ఇక బెంగళూరు-నర్సాపూర్(07154) రైలు  ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు పొడిగించారు. ఇక హైదరాబాద్-బెలగావి(07043) ఫిబ్రవరి 5 నుంచి 12 వరకు బెలగావి వరకు పొడిగించారు. బెలగావి-హైదరాబాద్(07044) ఫిబ్రవరి 6 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.

4 / 5
సంక్రాంతి సందర్భంగా రైల్వేశాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ నెల చివరి వరకు స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వీటిని తిప్పుతోంది.

5 / 5