బీహార్లోని సీతామర్హి జిల్లాలో జరిగిన ఓ హృదయవిదారక ఘటనలో 13 ఏళ్ల బాలుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పికప్ ట్రక్కు ఢీకొనడంతో రక్తం మడుగులో పడివున్న బాలుడిని విస్మరించి, స్థానికులు మాత్రం చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈ అమానవీయ చర్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది.