AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ORS vs Coconut Water: ORSకి ప్రత్యామ్నాయంగా కొబ్బరి నీళ్లు తాగవచ్చా? సైన్స్ ఏం చెబుతుందంటే..

కొబ్బరి నీటిని ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చా? లేదా? అనే అనుమానం చాలా మందికి ఉంది. WHO ప్రకారం.. ORS లో సోడియం, పొటాషియం, క్లోరైడ్, గ్లూకోజ్ అనేవి నిర్దిష్ట నిష్పత్తిలో ఉంటాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల లోపాన్ని..

Srilakshmi C
|

Updated on: Jan 17, 2026 | 10:56 AM

Share
బాహ్య సౌందర్యమైనా, అంతర్గత ఆరోగ్య సంరక్షణకైనా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. శరీరం కొవ్వు నిల్వ ఉండదు. మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి. కొబ్బరి నీళ్లలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా జుట్టు మూలాలను కూడా బలంగా ఉంచడంలో సహాయపడతాయి. విరిగిన గోర్లు, పగిలిన పెదవులు కూడా నయం అవుతాయి. కానీ కొబ్బరి నీటిని ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చా? లేదా? అనే అనుమానం చాలా మందికి ఉంది.

1 / 5
WHO ప్రకారం.. ORS లో సోడియం, పొటాషియం, క్లోరైడ్, గ్లూకోజ్ అనేవి నిర్దిష్ట నిష్పత్తిలో ఉంటాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల లోపాన్ని తీరుస్తుంది. ORS అనేది నిర్జలీకరణానికి పరిష్కారం. కొబ్బరి నీళ్లలో పొటాషియం, తక్కువ మొత్తంలో సోడియం, మెగ్నీషియం, సహజ చక్కెరలు ఉంటాయి. వ్యాయామం తర్వాత లేదా నిర్జలీకరణ సందర్భాలలో కొబ్బరి నీటి పాత్ర చాలా ముఖ్యమైనది.

2 / 5
కొబ్బరి నీళ్లలో సోడియం తక్కువగా ఉంటుంది. ORSలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ORSలో కొంత మొత్తంలో పొటాషియం ఉంటుంది. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. ORSలో పరిమిత పరిమాణంలో ఉంటుంది.

3 / 5
కొబ్బరి నీళ్లలో తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. కానీ మీకు విరేచనాలు లేదా వాంతులు ఉన్నప్పుడు సోడియం ఎక్కువగా స్థాయిలో అవసరం. జర్నల్ ఆఫ్ ఫిజియోలాజికల్ ఆంత్రోపాలజీ, WHO నివేదిక ప్రకారం కొబ్బరి నీరు తేలికపాటి డీహైడ్రేషన్‌కు సహాయపడుతుంది. కానీ తీవ్రమైన డీహైడ్రేషన్ లేదా విరేచనాల సందర్భాలలో కొబ్బరి నీరు ORSకి ప్రత్యామ్నాయంగా ఉండకపోవచ్చు.

4 / 5
వైద్యుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నీటిపై మాత్రమే ఆధారపడటం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. తీవ్రమైన విరేచనాలు, పదేపదే వాంతులు, పిల్లలు లేదా వృద్ధులలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం తర్వాత శరీరం బలహీనంగా ఉంటే, కొబ్బరి నీటిని కాకుండా WHO-ఆమోదించిన ORSని ఉపయోగించడం మంచిది.

5 / 5