సికింద్రాబాద్ జోన్ పరిధిలో నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రక్షిత మూర్తి తెలిపిన వివరాల ప్రకారం, వారి నుంచి 162 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న ఈ చైనా మాంజాపై దర్యాప్తు చేసి, కీలక సూత్రధారులపై చర్యలు చేపట్టారు.