అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి సురక్షితంగా వ్యోమగాములు..
నాసాకు చెందిన నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యారు. ఐఎస్‌ఎస్‌లో ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో మిషన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు ఇటీవల నాసా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైన వ్యోమగామి సహా నలుగురు ఆస్ట్రోనాట్‌లతో కూడిన క్రూ-11 డ్రాగన్ వాహకనౌక ఎండీవర్ గురువారం అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది.
క్రూ-11 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్‌ను నాసా ఇటీవల ప్రకటించింది. జనవరి 8న వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్‌మన్ 6.5 గంటల పాటు స్పేస్‌వాక్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే చివరి నిమిషంలో దీన్ని నాసా నిలిపివేసింది. క్రూ-11 మిషన్‌లో వెళ్లిన ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్‌వాక్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ.. వ్యోమగాములను మిషన్ పూర్తికాకముందే తిరిగి భూమ్మీదకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఫిబ్రవరిలో ఈ మిషన్ పూర్తికావాల్సి ఉండగా, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఒక నెల ముందే మిషన్‌ను ముగించారు. అయితే గోప్యతా కారణాలు, ప్రొటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమగామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

