Mauni Amavasya 2026: జనవరి 18న వచ్చే మౌని అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు. మహాశివరాత్రికి ముందు వచ్చే ఈ అమావాస్య నాడు మౌన వ్రతం, నదీ స్నానాలు, పితృ దేవతలకు పిండ ప్రదానం, రావి చెట్టు ప్రదక్షిణలు, గోమాతకు పెరుగన్నం తినిపించడం వంటివి ఆచరిస్తారు. ఈ పుణ్యకార్యాలతో పాపాలు తొలగి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.