భారత ఆటగాళ్ల ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం: పాక్ కోచ్ సంచలన కామెంట్స్..
సర్ఫరాజ్ అహ్మద్ గతంలో ప్లేయర్‌గా (2006 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్), కెప్టెన్‌గా (2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్) భారత్‌ను ఓడించగా, ఇప్పుడు మెంటార్‌గా మరోసారి ఫైనల్‌లో భారత్‌పై పైచేయి సాధించి తన సెంటిమెంట్‌ను కొనసాగించారు. అయితే, భారత్‌పై ఆయన చేసిన ఈ 'అన్-ఎథికల్' కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

యూత్ ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ భారీ విజయం సాధించిన తర్వాత, పాక్ అండర్-19 జట్టు మెంటార్ (కోచ్) సర్ఫరాజ్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైదానంలో టీమ్ ఇండియా ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, వారు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా (Unethical) వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
భారత్ ప్రవర్తనపై సర్ఫరాజ్ అభ్యంతరం..
దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసి టైటిల్ నెగ్గింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. “నేను గతంలో భారత జట్టుతో చాలాసార్లు ఆడాను. అప్పటి జట్లు ఆటను గౌరవించేవి. కానీ, ఈ ప్రస్తుత భారత అండర్-19 జట్టు ప్రవర్తన ఏమాత్రం బాలేదు. మైదానంలో వారు చేసిన సైగలు, వారి ప్రవర్తన క్రీడా ధర్మానికి విరుద్ధం (Unethical)” అని పేర్కొన్నారు.
వైరల్ వీడియో – “అనాగరికుల్లా మారకండి”..
మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో ఉన్న సర్ఫరాజ్ తన ఆటగాళ్లకు కొన్ని సూచనలు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆయన తన ప్లేయర్లతో.. “అవతలి వారు అనాగరికుల్లా (Ignorant) ప్రవర్తిస్తున్నారని మీరు కూడా అలా మారకండి. మనం మన పరిధిలో ఉండి, సభ్యతతోనే ఆడుదాం” అని ఉర్దూలో చెప్పడం వినిపించింది. మీడియా సమావేశంలో ఆ మాటలు తనవేనని ఆయన ధ్రువీకరించాడు.
వివాదానికి కారణం ఏంటి?
మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు అవుటైన సమయంలో పాక్ ప్లేయర్లు దూకుడుగా సెండాఫ్ ఇవ్వడం, ముఖ్యంగా ఆయుష్ మత్రే, వైభవ్ సూర్యవంశీ వికెట్లు పడినప్పుడు పాక్ బౌలర్లు అతిగా సంబరాలు చేసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. దీనిపై స్పందించిన సర్ఫరాజ్, భారత్ ప్రవర్తనను తప్పుబడుతూనే తమ జట్టు క్రీడా స్ఫూర్తితోనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందని చెప్పుకొచ్చాడు.
పాక్ చారిత్రక విజయం..
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ 172 పరుగులతో వీరవిహారం చేయడంతో పాక్ 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం టీమ్ ఇండియాను కేవలం 156 పరుగులకే ఆలౌట్ చేసి, 13 ఏళ్ల తర్వాత ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది.
సర్ఫరాజ్ అహ్మద్ గతంలో ప్లేయర్‌గా (2006 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్), కెప్టెన్‌గా (2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్) భారత్‌ను ఓడించగా, ఇప్పుడు మెంటార్‌గా మరోసారి ఫైనల్‌లో భారత్‌పై పైచేయి సాధించి తన సెంటిమెంట్‌ను కొనసాగించారు. అయితే, భారత్‌పై ఆయన చేసిన ఈ ‘అన్-ఎథికల్’ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








