కూరగాయలు అమ్మినట్లు పసికందుల విక్రయం
విజయవాడలో సరోజ గ్యాంగ్ శిశు విక్రయాల కేసు మరువకముందే నిజామాబాద్‌లో వరుస సంఘటనలు కలకలం రేపాయి. వారం రోజుల్లో రెండు శిశు విక్రయాల ఘటనలు చోటుచేసుకున్నాయి. యాచకురాలు తన బిడ్డను అమ్ముకోగా, మరో తల్లి తన పసికందును పూణేకు విక్రయించింది. ఈ ఘటనల వెనుక చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా హస్తం ఉందా అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలో జరిగిన సంచలనాత్మక శిశు విక్రయాల కేసు మరువకముందే, నిజామాబాద్‌లో వరుసగా చోటుచేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండు శిశు విక్రయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా, నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక యాచకురాలు తన 9 నెలల మగబిడ్డను రూ. 1.2 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. బిడ్డ కనిపించకపోవడంతో స్థానికుడి సమాచారంతో బాలల సంరక్షణ విభాగం, పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో తల్లితో పాటు బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తి, మధ్యవర్తులతో కలిపి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: మహిళలకు భారీ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు
Dubai: నదుల్లా మారిన దుబాయ్ రోడ్లు..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

