అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
ప్రకాశం జిల్లా పొదిలిలో పంటపొలాల పక్కన క్షుద్రపూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. అమావాస్య నాడు జరిగిన ఈ సంఘటనతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నల్ల కోడి బలి వంటి పూజా సామాగ్రితో చేతబడి చేశారనే అనుమానాలున్నాయి. గుప్తనిధుల కోసం లేదా ఎవరికైనా హాని తలపెట్టేందుకే ఈ క్షుద్రపూజలు జరిగి ఉండొచ్చని భయపడుతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అది ప్రకాశం జిల్లా పొదిలి శివారులోని పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమి. రైతులు, కూలీలు నిత్యం పనులు చేసుకుంటూ పండిన పంటలు తరలించే ప్రదేశం… అలాంటి ప్రదేశంలో ఒక్కసారిగా అలజడి రేగింది… పొలాలకు పక్కనే ఉన్న బంజరు భూమిలో ఎవరో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అంతే ఒక్కసారిగా రైతులు, గ్రామస్థులు హడలిపోయారు. వెంటనే సమాచారం గ్రామమంతా వ్యాపించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలే శుక్రవారం.. పైగా అమావాస్య..దీంతో మంత్రగాళ్లు గ్రామంలోకి వచ్చి పూజలు చేసిన ఆనవాళ్లు పొలాల్లో కనిపించడంతో గ్రామస్తులు పొలానికి వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఎవరూ అటువైపు వెళ్లవద్దని ఒకరికి మరొకరు చెప్పుకున్నారు. పచ్చని పొలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కత్తి, బూడిద గుమ్మడికాయ, నల్ల కోడి … ఇవన్నీ క్షుద్రపూజలు చేసే మంత్రగాళ్ల పూజాసామాగ్రి. అలాంటి సామాగ్రి నలుగురు తిరిగే పంటపొలాల పక్కన కనిపించడంతో ఆ గ్రామ రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేశారా, లేక ఎవరినైనా హతమార్చేందుకు బాణామతి, చేతబడి వంటి ప్రయోగాలు చేశారా అన్న అనుమానాలతో బిక్కుబిక్కుమంటున్నారు. కొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగుస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్‌లో 19వ తేది చివరి అమావాస్య వచ్చింది. అలాంటి అమావాస్య వేళ మంత్రగాళ్లు, క్షుద్రపూజలు చేయడానికి అనువైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో కొందరు గుప్తనిధుల కోసం, బాణామతి, చేతబడి వంటి క్షుద్రపూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా పొదిలి శివారులో పొలాల పక్కన బంజరు భూమిలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన గ్రామస్థులు, రైతులు హడలిపోయారు. చక్కగా గుంత తీసి పూజలు చేసి సమీపంలోని నీటి కుంట దగ్గర నల్లకోడిని బలిచ్చిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పొలాలవైపు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరో కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
T20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆటగాళ్లు వీరే
అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత
అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ
టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్!
వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి
టప టపా పేలిపోయిన సెల్ ఫోన్లు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు!
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. కోట్లు దండుకొని పరార్!
17 ఏళ్ళ తరువాత పెద్దమ్మ తల్లి దేవర ... కళ్ళు చెదిరే దృశ్యం
మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదు

