వైజాగ్లో ఒక కుటుంబం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న అరుదైన బ్లూ గోల్డ్ మకావ్ చిలుక మ్యాక్సీ ఎగిరిపోయింది. నెలన్నర కిందట హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఈ చిలుకను, ఎండ కోసం బయటకు తీసుకెళ్లగా ఒక్కసారిగా ఎగిరిపోయింది. తమ కుటుంబ సభ్యుడిలా భావించిన మ్యాక్సీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.