AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: టీటీడీ సరికొత్త ప్రయత్నం.. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్.. మెరుగైన సేవలే లక్ష్యంగా….

తిరుమల వెంకన్న భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని సేవలను మెరుగుపరుస్తుంది. ఐవీఆర్ఎస్, వాట్సాప్, ఈ-సర్వేతో పాటు శ్రీవారి సేవకులతో సర్వే చేపడుతోంది. క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసి మొబైల్ యాప్, టీటీడీ బుకింగ్ పోర్టల్ అప్లికేషన్‌తో టెక్నాలజీ వినియోగిస్తోంది.

Tirumala: టీటీడీ సరికొత్త ప్రయత్నం.. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్.. మెరుగైన సేవలే లక్ష్యంగా....
Tirumala
Raju M P R
| Edited By: Krishna S|

Updated on: Jul 12, 2025 | 6:09 PM

Share

భక్తులకు చేసే సేవనే భగవంతుడి సేవగా టీటీడీ భావిస్తోందా.. తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తిగా ఉంటేనే దేవ దేవుడు సంతోషిస్తాడని అనుకుంటుందా.. శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏడుకొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకునేందుకు టీటీడీ ఫీడ్ బ్యాక్ సిస్టంను అమలు చేస్తోంది. ఈ మేరకు ఫీడ్ బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు అందుతున్న సేవల గురించి భక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటుంది. టీటీడీ నుంచి ఇంకా ఎలాంటి సేవలను ఆశిస్తున్నారో ఆరా తీస్తోంది.

టీటీడీ అందిస్తున్న వివిధ సేవలపై భక్తుల నుండి టీటీడీ విస్తృత అభిప్రాయ సేకరణ చేపట్టింది. భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడంలో భాగంగా గత కొంత కాలంగా టీటీడీ భక్తుల నుండి విలువైన అభిప్రాయాల్ని వివిధ రకాల్లో తెలుసుకుంటుంది. ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా ఈ-సర్వే, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యూవల్ సర్వేలో టీటీడీ భక్తుల నుండి అభిప్రాయాలు తీసుకుంటోంది. ఎలక్ట్రానిక్ సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, లగేజ్ కౌంటర్ల పై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది.

ఇక వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం ద్వారా తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించింది. వాట్సాప్‌ నెం.9399399399 తో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుండగా భక్తులు తమ పేరు, విభాగం ఎంపిక చేసి అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు ఇలా ఏదైనా ఎంచుకొని ఫీడ్ బ్యాక్ ఇచ్చేలా అవకాశం కల్పించింది.

మరోవైపు శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ కూడా టీటీడీ చేపట్టింది. తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన అప్లికేషన్‌ను మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకుని భక్తుల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇక త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్, టీటీడీ బుకింగ్ పోర్టల్ నుండి కూడా భక్తుల విలువైన సలహాలు సూచనలు తీసుకొనడానికి అప్లికేషన్ సిద్ధం చేస్తోంది. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వేల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి ఆన్ లైన్ సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పడాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..