Margashirsha Purnima: మార్గశిర పున్నమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఆర్ధిక కష్టాలు తీరతాయట.
Margashirsha Purnima: ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్యకు హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, మార్గశిర పూర్ణిమ మరింత ప్రత్యేకంగా పరిగణించబడుతుంది...
Margashirsha Purnima: ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్యకు హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, మార్గశిర పూర్ణిమ మరింత ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మార్గశిర పూర్ణిమ వ్యక్తికి మోక్షాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ పౌర్ణమిని పురాణాల్లో మోక్షదాయిని అని అంటారు. ఈ రోజున దానం, ధ్యానం ,స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఈ మార్గశిర పున్నమి రోజున వ్యక్తి చేసే పూజలు 32 రెట్లు ఫలాన్ని ఇస్తాయని నమ్మకం.
ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవిలను ఆరాధిస్తారు. ఇలా చేయడం వలన మోక్షానికి మార్గం తెరవబడుతుందని హిందువుల నమ్మకం. మార్గశిర పౌర్ణమిరోజున ఉపవాసం చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం మెరుగుపడుతుంది. అంతేకాదు మానసిక ఒత్తిడి , గందరగోళం నుండి బయటపడతారు. ఈసారి మార్గశిర పూర్ణిమ.. డిసెంబర్ 18వ తేదీ శనివారం వచ్చింది. పున్నమి యొక్క శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం..
ఇది శుభ సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం.. మార్గశిర పూర్ణిమ నెల 18వ తేదీ.. శనివారం ఉదయం 07.24 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే డిసెంబర్ 19 ఆదివారం ఉదయం 10.05 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీ ఉదయం 09.13 గంటల వరకు సాధ్య యోగం, ఆ తర్వాత శుభ యోగం ప్రారంభమవుతుంది. పౌర్ణమి చివరి వరకు శుభ యోగం ఉంటుంది.
పూజా పద్ధతి మార్గశిర పూర్ణిమ నాడు ఉదయాన్నే నిద్రలేచి విష్ణువుని హృదయంలో ధ్యానిస్తూ ఉపవాస వ్రతం మొదలు పెట్టాలి. స్నానం చేసే సమయంలో ముందుగా ఆ నీటిలో గంగాజలం, తులసి ఆకులను వేసి ఆ నీటితో స్వామిని స్మరించుకుని పూజించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. పూజా స్థలంలో పద్మం ముగ్గు వేసి.. మండపం ఏర్పరచి లక్ష్మీమాత సమేతంగా ఉన్న శ్రీహరి చిత్రాన్ని ప్రతిష్టించండి. అనంతరం చందనం, పూలు, పండ్లు, ప్రసాదం, అక్షతం, ధూపం, దీపం మొదలైన వాటిని సమర్పించండి. అనంతరం పూజా స్థలంలో ఒక బలిపీఠాన్ని నిర్మించి.. అగ్నిని ఆవాహన చేయండి. తర్వాత ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః: స్వాహా ఇదం వాసుదేవ్ ఇదం నమమ’ అని స్మరిస్తూ.. 108 సార్లు అగ్నిని ఆవాహన చేయండి. అనంతరం పూజలో ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని ప్రార్ధించండి.
పూజానంతరం దానం
పూజ ముగిసిన తర్వాత మీ శక్తి కొలది చేయండి. జాతకంలో చంద్రుని స్థానం బలహీనంగా ఉంటే.. మార్గశిర పున్నమిరోజున పాలు, పాయసం, బియ్యం, ముత్యాలు మొదలైన తెల్లటి వస్తువులను దానం చేయండి. ఉపవాసం ఉన్నారు ఆరోజు రాత్రి నారాయణుని విగ్రహం దగ్గర పడుకోండి. రెండవ రోజు స్నానం చేసి బ్రాహ్మణుడిని పూజించండి. అతనికి భోజనం పెట్టి.. శక్తి కొలదీ దానాన్ని ఇవ్వండి. అనంతరం ఉపవాసం విరమించండి.
మార్గశిర పూర్ణిమ ప్రాముఖ్యత మార్గశిర పూర్ణిమ నాడు చేసే శుభ కార్యం 32 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఈ పున్నమి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇంట్లో సత్యన్నారాయణ కథ చదవాలి లేదా వినాలి. దీని వల్ల సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుందని, కుటుంబ కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం.