Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో అన్నమయ్య మార్గం అందుబాటులోకి.. సంక్రాంతి తర్వాత దర్శనాల సంఖ్య పెంపు..

Tirupati: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి దర్శనాల పెంపు తదితర విషయాలపై టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి..

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో అన్నమయ్య మార్గం అందుబాటులోకి.. సంక్రాంతి తర్వాత దర్శనాల సంఖ్య పెంపు..
Ttd Yv Subbareddy
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2021 | 3:59 PM

Tirupati: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి దర్శనాల పెంపు తదితర విషయాలపై టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో  టీటీడీ పాలక మండలి సమావేశమయ్యింది. ఈ సమావేశంలో తిరుమల అభివృద్ధి తదితర పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. అంతేకాదు తిరుమల గిరులపైకి చేరుకొనే అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలనీ సంకల్పించినట్లు చెప్పారు. అన్నమయ్య మార్గంలో రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం త్వరలోనే పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు నిర్మాణానికి టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది. కడప వైపు నుంచి వచర్ అన్నమయ్య మార్గాన్ని ఘాట్ రోడ్డుగా నిర్మించాలని మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే రోడ్డు లో అన్నమయ్య నడుచుకుంటూ ఏడు కొండలకి వచ్చారని చెబుతారు. ఇటీవల కురిసిన వర్షాలకు రెండు ఘాట్ రోడ్ల మీద కొండ చరియలు విరిగిపడిన నేపధ్యంలో భవిష్యత్ అవసరాల కోసం మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని   టీటీడీ నిర్ణయం తీసుకుంది.

కరోనా మార్గదర్శకాలు సడలించే అవకాశం ఉంటే సంక్రాంతి నుండి స్వామివారి దర్శనాల సంఖ్య పెంచుతామని చెప్పారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయించామని చెప్పారు సుబ్బారెడ్డి.

అంతేకాదు తిరుపతిలో ప్రారంభించిన పిడియాట్రిక్ ఆసుపత్రిలో విజయవంతంగా హార్ట్ సర్జరీలు జరుగుతున్నాయని .. నెల రోజుల్లో 11 మంది పిల్లల ప్రాణాలు కాపాడామని చెప్పారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. మరోవైపు పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిని పూర్తిస్థాయి అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి విరాళమిచ్చే దాతలకు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించామని అన్నారు.  హనుమ జన్మస్థలమైన ఆకాశగంగను విరాళాల ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి చెప్పారు.

Also Read:  పాతకార్ల ఇంజన్‌తో సొంతంగా హెలికాఫ్టర్‌ తయారు చేసుకున్న వ్యక్తి.. నెట్టింట వీడియో వైరల్‌

 అయ్యప్ప భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..