Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiacs Signs: ఈ రాశుల వారితో మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. లేదంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది..!

Zodiacs Signs: కొందరికి తార్కిక శక్తి ఎంతగా ఉంటుందంటే.. వారు ఎక్కడికెళ్లినా తమ పాయింట్‌నే ప్రధానంగా నిరూపించుకుంటారు. అలాంటి వారికి ఇతరులను మోసం చేయడం చాలా సులభం.

Zodiacs Signs: ఈ రాశుల వారితో మాట్లాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. లేదంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది..!
Zodiac Signs
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 12, 2021 | 1:49 PM

Zodiacs Signs: కొందరికి తార్కిక శక్తి ఎంతగా ఉంటుందంటే.. వారు ఎక్కడికెళ్లినా తమ పాయింట్‌నే ప్రధానంగా నిరూపించుకుంటారు. అలాంటి వారికి ఇతరులను మోసం చేయడం చాలా సులభం. ఈ విషయంలో నిపుణులుగా పరిగణించబడే వారిలో ప్రధానంగా ఈ రాశిచక్రాలకు చెందిన వారు ఉంటారు. వారు మైండ్‌గేమ్ ఆడటంతో నిష్టాతులు. ఎదుటి వారిని ఇట్టే బోల్తా కొట్టిస్తారు. అందుకే ఈ రాశి వారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా, అప్రమత్తతో మాట్లాడాల్సి ఉంటుంది.

కన్యా రాశి: ఎప్పుడూ తమను తాము చెప్పిందే, తాము అనుకున్నదే సరైనదిగా భావిస్తారు. తప్పులను ఒప్పుకోకపోవడం వారి స్వభావం. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరుల పనిలో తప్పులను వెతుకుతుంటారు. తమను తాము ఉత్తమంగా నిరూపించుకుంటారు. వీరిలో మాట్లాడే నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. ఎదుటి వారి నుంచి ప్రశంసలు పొందడానికి తెగ ఆసక్తి చూపుతారు. అయితే, ఈ రాశి వారితో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వారి నుండి అభిప్రాయాన్ని పొందాలనుకుంటే.. ముందుగా వారిని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది.

మిథునరాశి: మిథున రాశి వ్యక్తులు విషయాలను చాలా సులువుగా తారుమారు చేస్తారు. తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేస్తారని అంటారు కదా.. ఆ విధంగా విషయాలను ఏమారుస్తారు. ఈ వ్యక్తులు తమ అభిప్రాయాలను ఇతరులకు చెబుతారు. కానీ, ఇతరులు చెప్పే విషయాలను మాత్రం పట్టించుకోరు. వీరికి వాదించే చెడు అలవాటు కూడా ఉంటుంది. ప్రతీ సందర్భంలోనూ తమదే కరెక్ట్.. తాము చెప్పిందే సరైనది అని నిరూపించుకునేందుకు తాపత్రయపడుతారు. ఇలాంటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం ఉత్తమం.

వృశ్చికం : ఈ రాశి వారు ఎప్పుడూ ఇతరులను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తారు. దీని కోసం వారు ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు వారి మాటలను పట్టించుకోవద్దని భావించినా.. వారితో శత్రుత్వం పెంచుకోవడానికి ప్రయత్నించినా.. జనాల్లో మిమ్మల్ని పిచ్చివాళ్లను చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ దిశలో ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టరు. అందుకని ఇలాంటి వారితో గొడవ పడకపోవడమే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సింహం : ఈ రాశి వారికి అహంభావం ఎక్కువ. ఈ వ్యక్తులు ప్రతి పనిలో తమను తాము ఉన్నతంగా నిరూపించుకోవాలనుకుంటారు. ఎవరైనా తమ పనిలో తప్పును కనుగొంటే మైండ్ గేమ్‌ ఆడటం ప్రారంభిస్తారు. ఎదుటివారు తమపై చేసిన ఆరోపణలు తప్పు అని రుజువు చేస్తారు. ఇంకా ఎదుటి వారికి క్షమాపణ చెప్పడం వారికి అస్సలు ఇష్టం ఉండదు.

కుంభం: కుంభ రాశి వారు ఇతరులను చూసి చాలా అసూయపడతారు. ఎవరినీ తమకంటే ఉన్నతంగా చూడలేరు. ఎవరైనా తమ కంటే గొప్పవారైతే, వారిలోని లోపాలను లెక్కించడం ప్రారంభిస్తారు. వారిని తక్కువ అంచనా వేస్తారు. మైండ్ గేమ్‌ల విషయంలో ఈ వ్యక్తులు మాస్టర్స్. ఎవరితోనైనా ఘర్షణకు దిగితే.. వారికి సరైన గుణపాఠం చెప్పి ఊపిరి పీల్చుకుంటారు.

Also read:

Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్‌ స్టార్‌.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..

Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..