Portugese Man: పాతకార్ల ఇంజన్‌తో సొంతంగా హెలికాఫ్టర్‌ తయారు చేసుకున్న వ్యక్తి.. నెట్టింట వీడియో వైరల్‌

Portugese Man: కృషి, పట్టుదల, చేపట్టిన పని ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేసి తీరాలనే సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ వ్యక్తి రుజువు చేశాడు. సొంతంగా హెలికాఫ్టర్‌ను..

Portugese Man: పాతకార్ల ఇంజన్‌తో సొంతంగా హెలికాఫ్టర్‌ తయారు చేసుకున్న వ్యక్తి..  నెట్టింట వీడియో వైరల్‌
Helechapter
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2021 | 2:47 PM

Portugese Man: కృషి, పట్టుదల, చేపట్టిన పని ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేసి తీరాలనే సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ వ్యక్తి రుజువు చేశాడు. సొంతంగా హెలికాఫ్టర్‌ను తయారుచేసుకోవాలన్న అతని కలను నిజం చేసుకున్నాడు. సంకల్పం ఉంటే సరిపోదు.. అందుకు తగిన ప్రయత్నం పట్టుదల కూడా ఉండాలి. అతని పట్టుదల, సంకల్ప బలం వెరసి పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే సాధ్యమనుకునే హెలికాఫ్టర్‌ను సొంతంగా తయారు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

యూరప్‌లోని పోర్చుగీసుకు చెందిన ఓ వ్యక్తి ఈ హెలీకాఫ్టర్‌ను తయారు చేసాడు. పాత కార్లకు చెందిన విడి భాగాలతో అతను హెలికాప్టర్ తయారు చేశాడు. వోక్స్‌వాగన్ బీటిల్ కారు ఇంజిన్‌ను హెలికాఫ్టర్‌కు ఇంజిన్‌గా వాడాడు . కార్ల విడి భాగాలతో హెలికాఫ్టర్‌ లుక్‌ వచ్చేలా ఆయా విడి భాగాలను తయారు చేసి, వాటన్నింటినీ నట్లు, బోల్టులతో సెట్ చేశాడు. హెలికాఫ్టర్‌పైన ఉండే పెద్ద ఫ్యాన్‌ కోసం భారీ రెక్కలు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దాన్ని రోడ్డుపైకి తెచ్చి… ప్రయోగించి చూశాడు. రన్‌వేపైన అరకిలోమీటర్ వెళ్లిన హెలికాప్టర్ ఆ తర్వాత గాల్లోకి లేచింది. ఒరిజినల్ హెలికాప్టర్ లాగానే పైకి ఎగిరింది. దాంతో అతని కల ఫలించింది.. గాల్లో తేలిన హెలికాప్టర్‌ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఏదో ప్రయత్నిస్తున్నాడు గానీ ఇదంతా అయ్యే పని కాదులే” అనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడీ హెలికాప్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. డిసెంబర్‌ 9న ట్విట్టర్‌లోని @MendesOnca అకౌంట్‌లో ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను చూస్తున్న లక్షలమంది నెటిజన్లు ఆవ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది యూరప్ లోని పోర్చుగీస్‌లో జరిగినట్లు తెలిసింది.

హెలికాఫ్టర్‌పై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..

Also Read:

 మహారాష్ట్రలో ‘ఒమిక్రాన్’ కలవరం…144 సెక్షన్ అమలు.. లైవ్ వీడియో

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..