AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Rama Navami: రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం.. పాదయాత్రతో రామభక్తులు భద్రాద్రికి పయనం

20 ఏళ్లుగా ప్రతిఏటా కోదండరాముని కళ్యాణానికి గోటితో వొలిచిన తలంబ్రాలను భక్తులంతా కలిసి పాదయాత్రగా వెళ్లి సమర్పిస్తారు. ఈ యాత్ర పొడవునా.. భక్తులకు పోటీపడి మరీ వసతి సౌకర్యాలు కల్పిస్తారు ఆయా ప్రాంతాలవారు.

Sri Rama Navami: రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం.. పాదయాత్రతో రామభక్తులు భద్రాద్రికి పయనం
Ramayya Talambralu
Surya Kala
|

Updated on: Mar 26, 2023 | 12:08 PM

Share

భద్రాద్రి శ్రీసీతారామ కళ్యాణం ఈ నెల 30న భద్రాచలంలో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పది గ్రమాల భక్తులు కలిసి స్వామివారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేశారు. శ్రీరామ ఆథ్యాత్మిక సమితి జంగారెడ్డి గూడెం నుంచి 20 ఏళ్లుగా ప్రతిఏటా కోదండరాముని కళ్యాణానికి గోటితో వొలిచిన తలంబ్రాలను భక్తులంతా కలిసి పాదయాత్రగా వెళ్లి సమర్పిస్తారు. ఈ యాత్ర పొడవునా.. భక్తులకు పోటీపడి మరీ వసతి సౌకర్యాలు కల్పిస్తారు ఆయా ప్రాంతాలవారు. ఈ ఏడాది 300 కేజీలు గోటితో వొలిచిన తలంబ్రాలు సిద్ధం చేశారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లోని 100 గ్రామాల నుంచి 10 వేల మందికి పైగా భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. మార్చి 26న ప్రారంభమై 29వ తేదీ మధ్యాహ్నానికి భద్రాద్రికి చేరుకుంటారు. తిరిగి వచ్చిన తర్వాత స్వామివారి కళ్యాణ తలంబ్రాలను ఆయా గ్రామాల్లోని భక్తులందరికీ పంచుతారు.

పాదయాత్రను రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు తపన చౌదరి, నిర్వాహకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. గోటి తలంబ్రాలతో రామదండు భద్రాద్రికి పయనమైంది.. భక్తులు ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేసుకొని క్షేమంగా తిరిగిరావాలని శ్రీరామ ఆథ్యాత్మిక సమితి సభ్యులు ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..