Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ మొక్కను ఈ దిశలో నాటితే.. లక్ష్మీ దేవి, శుక్రుల అనుగ్రహం మీ సొంతం..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నారు పెద్దలు.. మనిషి జీవితంలో సగం సమస్యలు వారి ఆర్థిక పరిస్థితులకు సంబంధించినవే అయి ఉంటాయి. అందుకనే హిందువులు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం వివిధ పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే దైవం.. ప్రకృతి ఎప్పుడూ ఒకదానితో ఒకటి మంచి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కనుక కొన్ని రకాల మొక్కలు కొంత మంది దేవుళ్ళకు ప్రతీకగా భావిస్తారు. పూజిస్తారు. అదే విధంగా సంపాదకు అధిదేవత అయిన లక్ష్మీ దేవికి కూడా కొన్ని రకాల మొక్కలు ఇష్టమైనవని వాస్తు శాస్త్రం పేర్కొంది.

Vastu Tips: ఈ మొక్కను ఈ దిశలో నాటితే.. లక్ష్మీ దేవి, శుక్రుల అనుగ్రహం మీ సొంతం..
Vastu Tips For Plant
Surya Kala
|

Updated on: Jul 06, 2025 | 12:07 PM

Share

క్రాసులా మొక్క లక్ష్మీదేవి రూపం అని నమ్ముతారు. తులసికి కూడా ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. అయితే ఈ మొక్కలతో పాటు లక్ష్మీదేవికి కొన్ని రకాల పువ్వులంటే చాలా ఇష్టం. వాస్తవంగా లక్ష్మీదేవికి మాత్రమే కాదు ఇతర దేవుళ్ళకు కూడా మొక్కలన్నా, పువ్వులన్నా ఇష్టపడతారు. అయితే ఒక మొక్క మాత్రం లక్స్మిదేవికి, శుక్ర గ్రహానికి నేరుగా ముడిపడి ఉంది.

వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు, వాస్తు శాస్త్రంలో గులాబీకి సంబంధించిన అనేక నివారణలు ప్రస్తావించబడ్డాయి. గులాబీ పువ్వు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదని నమ్ముతారు. దీని సువాసన శుక్ర గ్రహానికి సంబంధించినవి. దీని గురించి వాస్తు శాస్త్రంలో చాలాసార్లు చర్చించబడింది. అయితే ఈ మొక్కని ఇంట్లో ఏ దిశలో పెంచుకోవడం శుభప్రదం తెలుసుకుందాం.

లక్ష్మిదేవికి గులాబీలు అంటే చాలా ఇష్టం. గులాబీ రేకులు, రోజ్ వాటర్, గులాబీ పెర్ఫ్యూమ్ అనేక ఉపయోగాలను వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. దీని సువాసన, అందం ఇంట్లో సానుకూలతను పెంచుతుంది. సంపదను ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రేమ సంబంధాలకు గులాబీలు చాలా ముఖ్యమైనవని వాస్తు నిపుణులు అంటున్నారు. బెడ్ రూమ్ లో గులాబీ రేకులకు సంబంధించిన అనేక చర్యలు భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచడంలో ఉపయోగకరంగా ఉంటాయి.

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో నైరుతి దిశలో నాటడం శుభప్రదం. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ దిశలో ఎర్ర గులాబీని నాటితే.. లక్ష్మీ దేవి మీ వైపు ఆకర్షితులవుతుంది. వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం రెండూ శుక్రవారాల్లో గులాబీలతో అనేక ఉపయోగాలున్నాయని ప్రస్తావించాయి. వాటిలో ఒకటి లక్ష్మీ దేవికి గులాబీలను సమర్పించడం. శుక్రవారాల్లో లక్ష్మీ దేవికి గులాబీలను సమర్పించే వారికి డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

గులాబీ రేకులను కర్పూరంతో కలిపి కాల్చడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది.

ఇంట్లో గులాబీ మొక్కను నాటడం ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ పరిహారం చేయడం వలన ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది.

మీరు శుక్రవారం నాడు ఈ మొక్కను ఇంటికి తీసుకువచ్చి నైరుతి దిశలో నాటవచ్చు. ఇది మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉండేలా చేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గులాబీ మొక్క నాటితే.. సమాజంలో యజమాని, గృహిణి గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు
ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు
మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..
మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..
మెంటల్‌ స్ట్రెస్‌తో మెదడుకి చేటు.. చికిత్స చేసే పంచతంత్రాలు ఇవే!
మెంటల్‌ స్ట్రెస్‌తో మెదడుకి చేటు.. చికిత్స చేసే పంచతంత్రాలు ఇవే!
ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారా? ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి..
ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారా? ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి..
సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే..
సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే..
Viral Video: నీటిలో మొసలిని రాకెట్‌ స్పీడ్‌తో వేటాడిన చిరుత...
Viral Video: నీటిలో మొసలిని రాకెట్‌ స్పీడ్‌తో వేటాడిన చిరుత...
Andhra Pradesh: తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారిన సీఎం...
Andhra Pradesh: తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారిన సీఎం...
14 ఏళ్లకే హీరోయిన్.. 36 ఏళ్లకే గుండె జబ్బుతో మరణం..
14 ఏళ్లకే హీరోయిన్.. 36 ఏళ్లకే గుండె జబ్బుతో మరణం..