Japana: ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి.. అగ్నిపర్వతం బద్దలు.. దీవులను ఖాళీ చేస్తోన్న ప్రజలు.. న్యూ బాబా వంగా భవిష్యం నిజం అవుతుందా..!
బాబా వంగా పేరుపొందిన జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సు వేసిన అంచనాలు నిజం అవుతున్నాయా అని పలువురు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే జపాన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో వరుస భూకంపాలతో అట్టుడికి పోతోంది. అంతేకాదు జూలై 5వ తేదీ శనివారం టోకారా దీవుల్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3 నమోదయింది. మరోవైపు అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో ఆ దేశ ప్రజలు జపాన్ బాబా వంగా అంచనాలు నిజం అవుతాయా అంటూ ఆందోళన చెందుతున్నారు.

జపాన్‌లోని మౌంట్ షిన్మోడాకే అనే అగ్ని పర్వతం బుధవారం మధ్యాహ్నం బద్దలైంది. దీంతో అగ్ని పర్వతం నుంచి దట్టమైన పొగ, బూడిద రేణువులు అనేక మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా స్థానికులు పర్వతం నుంచి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు శుక్రవారం సమీపంలోని మారుమూల దీవుల నుండి నివాసితులను ఖాళీ చేయించారు. ఓ వైపు భూ ప్రకంపనలు, మరోవైపు అగ్నిపర్వతం బద్దలు కావడంతో ఆ దేశం అట్టుడికి పోతోంది. ఆ దేశ ప్రజలు ఏమి జరుగుతుందో అంటూ అల్లాడుతున్నారు. అంతేకాదు రియో వేసిన అంచనా నిజమైతుందా అని ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు టోకారా దీవుల్లో జులై 5న భూకంపం సంభవించింది. 5.3 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి సౌత్ వెస్టర్న్ జపాన్ వణికింది. భూమి కంపించిన విషయాన్ని జపాన్ మెటిరియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. టొకారో దీవుల్లో ఉదయం 6. 29 గంటల సమయంలో భూమి కంపించినట్లు వెల్లడించింది. ఈ భూకంపం 20 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయిందని తెలిపింది. గత రెండు వారాలలో కగోషిమా ప్రిఫెక్చర్‌లో 1,000 కు పైగా ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జూలైలో ఒక పెద్ద విపత్తు గురించి మాంగా అంచనాతో ముడిపడి ఉన్న ఊహాగానాలను తీవ్రతరం చేసింది.
2025 లో జపాన్‌లో ఒక పెద్ద విపత్తు వస్తుందని.. ఫసిపిక్ మహా సముద్రంలో భారీ విస్పోటనం జరుగుతుందని రియో వెల్లడించింది. అయితే ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలవడంతో జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి వేసిన అంచనా నిజం అవుతుందా అంటూ ఆమె అంచనాకు సంబంధించిన సూచనలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అయితే ఆన్‌లైన్‌లో వ్యాపించే నిరాధారమైన విపత్తు పుకార్లను నమ్మవద్దని ప్రజలను ప్రభుత్వం కోరింది.
This afternoon: A powerful eruption occurred at Mount Kirishima’s Shinmoedake crater at 1:49 PM (local time).
Volcanic smoke rose an estimated 5,000 meters into the sky. Ongoing activity continues to be closely monitored.( July 03, 2025)
📍 Shinmoedake, Kyushu, Japan pic.twitter.com/B1SjPXNmIV
— Weather Monitor (@WeatherMonitors) July 3, 2025
రియో అసాధారణ దూరదృష్టితో తరచుగా బాబా వంగాతో పోల్చుతున్నారు. జూన్ ప్రారంభంలో జరిగిన ఒక విపత్కర సంఘటనను ప్రస్తావించిన టాట్సుకి జోస్యం ఆన్‌లైన్‌లో తిరిగి చక్కర్లు కొడుతోంది. రియో రాసిన ‘ది ఫ్యూచర్ ఐ సా’ పుస్తకంలో జపాన్ దేశంలో జూలై నెలలో భారీ విపత్తు సంభవించనున్నదని.. దేశంలో భూకంపాలు, వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయని వెల్లడించింది. ప్రకృతి సృష్టించే విధ్వంసం కారణంగా దేశంలో పెను మార్పులు ఏర్పదనున్నాయని పుస్తకంలో ప్రస్తావించింది. దీంతో జపాన్ ప్రజలు జులై 5 అంటేనే భయాపడిపోయారు.. అందుకు తగినట్లుగా జూలై 5 న భూకంపం ఏర్పడడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
[Intensity Map] JMA Reports: A magnitude 5.3 #earthquake #地震 with a max intensity of 5+ and a depth of 20km has occured トカラ列島近海 (The sea near the Tokara archipelago) at 07/05 06:29 JST. #japan pic.twitter.com/AeUxjwkDfe
— Rapid Earthquake Alerts – Japan (@RapidQuakeAlert) July 4, 2025
అయితే బాబా వెంగా చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ ను సునామీ ముంచెత్తింది. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీగా పేరొందింది. ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇక జూన్ 21 నుంచి ఇప్పటివరకు టొకారో దీవుల్లో 1000 కు పైగా భూకంపాలు సంభవించాయి. జులై 3 న కూడా 5.5 తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..