Leech Therapy: జలగ చికిత్స క్యాన్సర్‌ను నయం చేయగలదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
జలగ చికిత్స అనేది అనేక వ్యాధులకు (కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు వంటివి) సాంప్రదాయ చికిత్స. ఇది రక్తంలోని మలినాలను తొలగించి, వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయదని, లక్షణాల ఉపశమనానికి మాత్రమే ఉపయోగపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రక్తహీనత వంటి కొన్ని పరిస్థితులలో ఇది సిఫార్సు చేయబడదు. వైద్య సలహా తప్పనిసరి.

ఈ రోజుల్లో ప్రజలు అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. వ్యాధి ఏదైనా సరే.. అకస్మాత్తుగా వస్తుంది. ఎందుకంటే మన జీవనశైలి చాలా దిగజారిపోయింది. దీంతోనే ప్రజలు వివిధ వ్యాధుల బాధితులుగా మారుతున్నారు. కొన్ని వ్యాధులను చికిత్స ద్వారా సులభంగా నయం చేయవచ్చు. మరికొన్నిసార్లు వాటికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు వాటిని వదిలించుకోవడానికి కొన్ని రకాల థెరపీలను ఉపయోగిస్తారు. వాటిలో లీచ్ థెరపీ కూడా ఉంటుంది. చాలా కాలంగా దీనిని ఉపయోగిస్తున్నారు. అనేక వ్యాధుల నుండి బయటపడటానికి ప్రజలు లీచ్ థెరపీ ఉపయోగిస్తున్నారు. కానీ, క్యాన్సర్ చికిత్సకు లీచ్ థెరపీని ఉపయోగించవచ్చా? ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం..
– జలగ చికిత్స ఎలా చేస్తారు..?
ఇది ఒక జీవిని ఉపయోగించి నిర్వహిస్తారు. చికిత్స సమయంలో దీనిని శరీరానికి అంటిస్తారు. అక్కడ ఆ జీవులు రక్తంలోని మలినాలను అతుక్కుని బయటకు తీస్తాయి. ఈ జీవిని శరీరంపై 15-20 నిమిషాలు అలాగే ఉంచి, అది చిక్కగా అయిన తర్వాత తొలగిస్తారు. గడ్డలు, కణితులు, తిత్తులు వంటి పరిస్థితులకు జలగ చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
– ఏ వ్యాధులలో జలగ చికిత్స ప్రయోజనకరంగా ఉంటుంది?
* కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్
* చర్మ వ్యాధులు
* రక్త ప్రసరణ సమస్యలు
* మైగ్రేన్‌లో సహాయపడుతుంది
* తలనొప్పికి ఉపయోగపడుతుంది.
* వాపు నుండి ఉపశమనం పొందడంలో ప్రయోజనకరంగా ఉంటుంది
– లీచ్ థెరపీ క్యాన్సర్‌ను నయం చేయగలదా?
క్యాన్సర్ కు లీచ్ థెరపీ నివారణ కాదని నిపుణులు చెబుతున్నారు. కానీ గడ్డలు, నొప్పి, కణితులు, తిత్తులు వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు దీనిని ఉపయోగించవచ్చు. అయితే, లీచ్ థెరపీ క్యాన్సర్ ను పూర్తిగా నయం చేస్తుందని చూపించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు. ఉపశమనం కోసం మీరు దీనిని ప్రయత్నించవచ్చు.
– ఎవరు జలగ చికిత్స చేయించుకోకూడదు?
మీకు రక్తహీనత, రక్తస్రావం లేదంటే బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. జలగ చికిత్సను నిర్ణయించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




