AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ వేళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? చిన్న సమస్య అనుకుని నిర్లక్ష్యం చేయవద్దు

ప్రస్తుత రోజుల్లో తీవ్రమైన వ్యాధులు పెరిగాయి. వేలుపై గడ్డలు, పుట్టుమచ్చ మార్పులు, మానని గాయాలు లేదా చర్మం గరుకుగా మారినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. నొప్పి, వాపు లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో గుర్తించడం, చికిత్స పొందడం వల్ల తీవ్ర పరిణామాలను నివారించవచ్చు.

మీ వేళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? చిన్న సమస్య అనుకుని నిర్లక్ష్యం చేయవద్దు
Finger Cancer Symptoms
Jyothi Gadda
|

Updated on: Dec 25, 2025 | 10:53 AM

Share

ప్రస్తుత రోజుల్లో ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు చాలా పెరిగాయి. మీరు చెవి, ముక్కు, గొంతు, వేలుపై ఏదైనా రకమైన గడ్డ వంటిది గమనించినట్టయితే.. దానిని అస్సలు విస్మరించవద్దు. ఎందుకంటే.. మీరు చేసే చిన్న నిర్లక్ష్యం తీవ్రమైన వ్యాధికి కారణం కావొచ్చు. వేలుపై ఏదైనా గాయం అయినప్పుడు అది మానకపోతే, గడ్డలాంటిది ఏర్పడటం ప్రారంభించినా, పుట్టుమచ్చ రంగు మారుతుంటే, చర్మం గరుకుగా లేదా ఎర్రగా మారుతుంటే, దురద లేదా రక్తస్రావం కనిపిస్తే..వెంటనే మీరు అలర్ట్‌ అవ్వండి. ఇలాంటి లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్ రూపంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇవి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు.

వేలు క్యాన్సర్ అంటే ఏమిటి?

వేళ్ల క్యాన్సర్ అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. చర్మం, ఎముకలు లేదా గోళ్లలో దీనిని పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అయితే, వేళ్ల క్యాన్సర్ ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ వంటి ఇతర అవయవాల నుండి కూడా వ్యాపిస్తుంది. దీనిని డిజిటల్ మెటాస్టాటిక్ వ్యాధి అంటారు. ఇది ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చర్మ మార్పులు: మీ వేలిపై కొత్త పుట్టుమచ్చ లేదా మొటిమను గమనించినట్లయితే, లేదా ఇప్పటికే ఉన్న పుట్టుమచ్చ లేదా మొటిమ పరిమాణం, రంగు లేదా ఆకృతిలో మార్పు ఉంటే దానిని విస్మరించవద్దు.

గడ్డ వంటిది – చర్మం కింద లేదా ఎముకలో నెమ్మదిగా పెరిగి పోయే గట్టి ముద్ద లేదంటే గడ్డవంటిది. ఇది కాలక్రమేణా నొప్పిని కలిగిస్తే మీరు వెంటనే తగిన టెస్ట్‌ చేయించుకోవాలి.

నొప్పి, వాపు – మీరు నిరంతరం లేదా పెరుగుతున్న నొప్పిని అనుభవిస్తే, ముఖ్యంగా ఎముకలో లేదా మీ వేలులో వాపు, గట్టితనం అనిపిస్తే, మీకు చికిత్స అవసరం.

గరుకు చర్మం కలిగి ఉండటం – మీ వేలు సాధారణంగా కనిపించకపోతే, చర్మంపై ఎరుపు లేదా పొలుసుల మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

సరిగ్గా నయం కాని గాయాలు – సరిగ్గా నయం కాని గాయాలు తప్పనిసరిగా క్యాన్సర్ వల్ల సంభవించవు. డయాబెటిస్ కూడా ఒక కారణం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం.

డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్ళాలి? :

గడ్డలు వంటివి పెరుగుతూ ఉంటే, నొప్పి లేదా ఒత్తిడి అనుభూతి కలిగినా కూడా డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. గాయాలు మానిపోవడం లేదు అంటే కూడా వైద్యుడిని సంప్రదించాలి. తరచూ జ్వరం, బరువు తగ్గడం, చేతి, కాలి వేళ్లలో సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు.

లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

మీరు మీ వేళ్లు, చేతులను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. ఏదైనా అసాధారణ మార్పులు గమనిస్తే వెంటనే ఆర్థోపెడిస్ట్ లేదా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. క్యాన్సర్‌తో పాటు, బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే షుగర్‌ వల్ల కూడా ఇలాంటి సమస్యలు సంభవించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..