- Telugu News Photo Gallery Healthier Rice Alternatives to White Rice: These are nutrition rich rice Varieties in india
తెల్ల బియ్యం పక్కకు పెట్టండి.. తినే ఆహారంలో ఆరు రకాల బియ్యాన్ని చేర్చుకోండి.. ఇవి పోషకాల నిధి..
మన దేశంలో ముఖ్యంగా తూర్పు , దక్షిణ భారతదేశంలో అన్నం ప్రధాన ఆహారం. అన్నం ఆరోగ్యకరమైన ఆహారం. అయితే ఎక్కువగా తెల్ల బియ్యంతో చేసిన అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే అధిక కార్బోహైడ్రేట్లు, అధిక గ్లైసెమిక్ సూచిక కారణంగా.. ఇది ఆరోగ్య దృక్కోణంలో చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడదు. అయితే అన్నంగా తెల్ల బియ్యానికి బదులుగా పోషకాలు అధికంగా ఉన్న ఆరు రకాల బియ్యం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం.
Updated on: Jul 06, 2025 | 8:52 AM

భారతదేశంలో తెల్ల బియ్యం వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు ఈ బియ్యాన్ని చాలా తక్కువ పరిమాణంలో ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు. వాస్తవానికి దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా ఉంటుంది. ఇది దాదాపు 70 నుంచి 90 వరకు ఉంటుంది. ఇందులో తక్కువ పోషకాలు ఉంటాయి. సాధారణ కార్బోహైడ్రేట్లు భారీ పరిమాణంలో కనిపిస్తాయి. కనుక దీనిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. ఊబకాయం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇప్పటికే మధుమేహం ఉన్నవారు తెల్ల బియ్యం తినడం మానేయాలి. లేకుంటే రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. తెల్ల బియ్యం మాత్రమే కాదు మన దేశంలో అనేక రకాల బియ్యం పండిస్తారు. ఈ రోజు పోషకాలు అధికంగా ఉండి.. తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆరు రకాల బియ్యం గురించి మనం తెలుసుకుందాం..

అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో ఒకటైన అన్నాన్ని మన దేశంలో చాలా వరకు ఇష్టపడతారు. ఇది జీర్ణం కావడం సులభం. అంతేకాదు దీనిలో ఫైబర్ , కొన్ని పోషకాలు ఉంటాయి. అయితే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల, ఇది శక్తిని కూడా అందిస్తుంది. అయితే తెల్ల బియ్యంతో చేసిన అన్నంలోని ప్రతికూలతలను పరిగణనలోకి తీసుకుంటే.. దీనిని తక్కువగా తినడం మంచిది. అందుకే తినే ఆహారంలో తెల్ల బియ్యానికి బదులుగా పోషకాలు అధికంగా ఉండే ఐదు రకాల బియ్యం గురించి తెలుసుకుందాం.

బ్లాక్ రైస్: భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ , అస్సాంలలో పండించే నల్ల బియ్యంలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని అక్కడ "చక్ హావో" అని పిలుస్తారు. ఈ నల్ల బియ్యాన్ని తినే ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇది నలుపు లేదా చాలా ముదురు ఊదా రంగులో ఉంటుంది. దీనిలో ఉండే నలుపు రంగు ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ నుంచి వస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

ఎర్ర బియ్యం: కేరళ లేదా తమిళనాడు వంటి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలతో పాటు అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో కూడా పండిస్తారు. ఈ ఎర్ర బియ్యం రసాయన ఎరువులు లేకుండా పండిస్తారు. దీనిని డీప్ వాటర్ రైస్ అని "బావో-ధాన్" అని కూడా పిలుస్తారు. ఇది చాలా ప్రజాదరణ పొందిన బియ్యం రకం. చాలా సులభంగా లభిస్తుంది. దీనిని ఉత్తరకాశి, బాగేశ్వర్ లలో కూడా పండిస్తారు. ఈ బియ్యం రక్తంలో చక్కెర నియంత్రణ , బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

నవర బియ్యం: భారతదేశంలో లభించే వివిధ రకాల బియ్యంలో నవర బియ్యం కూడా ఒకటి. దీని అసలు పేరు నివార.. ఏ రోగాన్ని అయినా నివారిస్తుంది కనుక ఈ బియ్యానికి నవరా బియ్యమని అంటారు. అయితే ఈ బియ్యం ఎక్కువగా కేరళ ప్రాంతంలో పండిస్తారు కనుక దీనిని కేరళ బియ్యంగా కూడా పిలుస్తారు. ఈ రైస్ లో అనేక ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇందులో అనేక యాంటీఆక్సిడెంట్లు, అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక ఇది శిశువుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

నల్ల జీలకర్ర బియ్యం: బియ్యం రకాల గురించి మాట్లాడుకుంటే ఈ నల్ల జీలకర్ర బియ్యాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. దీనిని కోరాపుట్ బ్లాక్ జీలకర్ర బియ్యం అని కూడా అంటారు. ఈ బియ్యం వాటి వాసన , అద్భుతమైన రుచికి ప్రసిద్ధి చెందాయి. నల్ల రంగులో ఉంటాయి. చిన్న జీలకర్ర గింజల వలె కనిపిస్తాయి. ఈ బియ్యాన్ని ఒడిశాలోని కోరాపుట్‌లో ఎక్కువగా పండిస్తారు.

వెదురు బియ్యం: దీనిని బాంబూ రైస్, దీనిని మూంగిల్ బియ్యం లేదా ములయరి అని కూడా అంటారు. ఇది వెదురు మొక్కల నుంచి లభించే బియ్యం. వెదురు బియ్యం గ్రీన్ కలర్ లో ఉంటుంది. సాధారణ బియ్యంతో పోలిస్తే పోషకాలు, ఫైబర్ ఎక్కువగా కలిగి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఈ బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.



















