గోవా దగ్గరిలోని అద్భుతమైన హిల్ స్టేషన్స్ ఇవే.. వెళ్తే ఆ ఆనందమే వేరు..
గోవా అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది బీచ్‌లు. ఇది బీచ్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అయితే గోవా దగ్గర సందర్శించడానికి బీచ్‌లే కాకుండా అద్భుతమైన హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయంట. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయంట. కాగా, గోవా దగ్గరిలోని బీచ్‌లు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Jul 05, 2025 | 9:34 PM

అంబోలి ఘాట్. ఇది మహారాష్ట్రలోని ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడి కొండలు పచ్చని చెట్లు, జలపాతాలతో చాలా అందంగా, అద్భుతంగా ఉండే ప్రదేశం. జనసమూహానికి దూరంగా ప్రకృతి మధ్య అందంగా, ఆనందంగా గడపడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడి మహాదేవ్ ఘర్ కోట, సన్ సెట్ పాయింట్ చూడటానికి ప్రసిద్ధి చెందినవి.

గోవా నుంచి దాదాపు 581 కిలోమీటర్ దూరంలో ఉన్న అనంతగిరి కొండలు బెస్ట్ హిల్ స్టేషన్స్. ఇవి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి కోట్ పల్లి జలపాతం, నాగసముద్రం, బొర్రా గుహలు, అనంతపద్మనాభ స్వామి ఆలయం, డాల్ఫినోస్, ట్రెక్కింగ్ ట్రైల్స్ పర్యాటకులకు చాలా ఆనందాన్ని ఇస్తాయి.

అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్‌లో దండేలి ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడ నలు మూలల పచ్చటి చెట్లు, వన్యప్రాణుల, అభయారణ్యం వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇవే కాకుండా ఇక్కడ చూడటానికి శిరోలి శిఖరం, అలాగే రివర్ రాఫ్టింగ్ కూడా చేయవచ్చు. అలాగే జలపాతాలు, కవాలా గుహలు వంటి ప్రదేశాలు ప్రసిద్ధి చెందినవి.

మహారాష్ట్రలో ఉన్న రాజ్‌మాచి అద్భుతమైన పర్యాటక ప్రదేశం.రాజ్ మాచి కోటలో 17వ శతాబ్ధంలో ఛత్రపతి శివాజి మహారాజ్ నిర్మిచిన రెండు కోటలను సందర్శించవచ్చు. అంతే కాకుండా ట్రెక్కింగ్ చేయాలి అనుకునేవారి ఇది బెస్ట్ ప్లేస్. అ లాగే అందమైన జలపాతాలు, ఉల్హాస్ వ్యాలీ, పశ్చిమ కనుమల అందాలు చూడాలి అనుకునేవారు మహారాష్ట్రకు వెళ్లాల్సిందే.

గోవా నుండి దాదాపు 100 కి.మీ దూరంలో ఉన్న సావంత్ వాడి కూడా అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది కూడా మహారాష్ట్రాలోనే ఉంది. ఇక్కడ అంబోలి ఘాట్, జలపాతాలు, పచ్చటి చెట్లుచ కొండలు, హస్తకళలు, వంటివాటికి ప్రసిద్ధి చెందినది.



















