AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravana: బ్రహ్మ రాతని మార్చాలనుకున్నాడు.. కొడుకు కోసం శనీశ్వరుడిని బంధించి.. చావుని తెచ్చుకున్న రావణుడు..

లంకాధిపతి రాక్షసుడైన రావణుడు నవ వ్యాకరణ పండితుడు. గొప్ప శివ భక్తుడు. గొప్ప విద్వాంసుడు. రావణుడు తన కొడుకు స్వర్గానికి రాజు కావాలని, ఇంద్ర సింహాసనాన్ని అధిష్టించాలని కోరుకున్నాడు. అందుకే రావణుడు తన కొడుక్కి ఇంద్రజిత్ అని పేరు పెట్టాడు. అయితే అతను జనన సమయంలో.. శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు. ఇంద్రజిత్ జాతకంలో శని తిరోగమనంలోకి వెళ్ళాడు. దీంతో రావణుడు తన శక్తిని ఉపయోగించి శనీశ్వరుడిని బందీగా ఉంచాడు. ఇలా రావణుడు ఎందుకు చేశాడంటే..

Ravana: బ్రహ్మ రాతని మార్చాలనుకున్నాడు.. కొడుకు కోసం శనీశ్వరుడిని బంధించి.. చావుని తెచ్చుకున్న రావణుడు..
Mythology Story
Surya Kala
|

Updated on: Jul 06, 2025 | 10:42 AM

Share

రావణుడు గొప్ప విద్యావంతుడు. చాలా జ్ఞానవంతుడు. అయితే అంతే గర్విష్ఠుడు. అతని అహంకారం వల్లే మరణించాడు. తన కొడుకు పుట్టిన సమయంలో రావణుడు నవ గ్రహాలను బంధించాడు. రావణుడి భార్య మండోదరి రాక్షస శిల్పి మాయాసురుడి కుమార్తె. మండోదరి శివ భక్తురాలు. అందమైన యువతి. తెలివైనది. దీంతో రావణుడు ఆమెను తన భార్యగా ఎంచుకున్నాడు. ఈ కారణంగానే రావణుడు మండోదరిని వివాహం చేసుకున్నాడు. తన కుమారుడు శక్తివంతుడు, తెలివైనవాడు కావాలని అతను కోరుకున్నాడు.

కొడుకు జన్మించే సమయానికి గ్రహాలను బంధించిన రావణుడు రావణుడు చాలా బలశాలి. చాలా జ్ఞానవంతుడు. రాక్షసుడైన రావణుడు ఇంద్ర సింహాసనాన్ని సాధించాలని కలలు కన్నాడు. అందుకోసం అతను చాలా ప్రయత్నాలు చేసాడు. అయితే విజయం సాధించలేకపోయాడు. అపుడు రావణుడు తన కొడుకు ద్వారా తన అసంపూర్ణమైన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. అందుకే తన కొడుకు జన్మించినప్పుడు.. అన్ని గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉండాలని కోరుకున్నాడు. మండోదరికి ప్రసవ నొప్పులు ప్రారంభమైన సమయంలో నవ గ్రహాలు సరైన స్థానంలో లేవు. దీంతో రావణుడు తన కొడుకు జతకం సరిగ్గా ఉండాలని.. తొమ్మిది గ్రహాలను బంధించాడు. తన కోరిక ప్రకారం వాటిని జాతకంలో సరైన స్థానంలో ఉండాలని కోరాడు. మేఘనాథుడి జాతకంలో నవ గ్రహాలు శుభప్రదమైన, ఖచ్చితమైన స్థితిలో ఉండాలని అతను కోరుకున్నాడు.

రావణుడి మాట వినని శనీశ్వరుడు రావణుడిని బంధించడం వల్ల నవ గ్రహల్లోని శనీశ్వరుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలు ఆయన మాట విన్నాయి. అయితే చివరి క్షణంలో శనీశ్వరుడు తన గ్రహ స్థితిని మార్చుకున్నాడు. ఇది చూసిన రావణుడు కోపోద్రిక్తుడై శనీశ్వరుడిని తన కాళ్ళ కింద తొక్కి పెట్టి నలిపివేశాడు. అంతేకాదు రావణుడు శనీశ్వరుడితో నువ్వు నా కాళ్ళ కింద ఉన్నప్పుడు నా కొడుకు మీద నీ చెడు దృష్టి ఎలా వేయగలవని అహంకారం ప్రదర్శించాడు. అయితే అప్పటికే శనీశ్వరుడు నేరుగా రావణుడిని చూడడంతో ఆయన చెడు దృష్టి రావణుడి మీద పడింది. అప్పుడే రావణుడి పతనం.. లంకకు చెడు సమయంమొదలైంది. రావణుడి మరణం రాముడి చేతిలోనే నిర్ణయించబడింది. ఈ సంఘటన తర్వాత రావణుడు శనీశ్వరుడిని లంకలో బంధించాడు. అంతేకాదు శనిశ్వరుడి కాలుపై దాడి చేశాడు. ఈ కారణంగా శనీశ్వరుడు కుంటుతూ నడుస్తుంటాడు. మిగిలిన గ్రహాలు రావణుడి మాట వినడంతో రావణుడి చేర నుంచి విడుదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

శని దేవుడిని బంధనం విడిపించిన హనుమంతుడు తరువాత హనుమంతుడు సీతాదేవిని వెతుక్కుంటూ లంకకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడి చూసి బంధనం నుండి విడిపించాడు. అప్పుడు శనీశ్వరుడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు.. ఇక నుంచి నిన్ను పూజించే వారెవరిపై తాను ఎలాంటి ప్రభావం చూపను… తన చెడు దృష్టి అతనిపై పడదని చెప్పాడు. అందుకే శనీశ్వర ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి హనుమంతుడిని పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..