Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Temple: ఈ సీజన్ లో ప్రకృతి, సంస్కృతిల అందమైన సంగమం వాటర్ టెంపుల్.. ఎక్కడంటే..

కేరళ సహజ సౌందర్యానికి మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఉన్న ఆలయాల్లో వెరీ వెరీ స్పెషల్ వాటర్ టెంపుల్. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేవారికి స్వర్గధామం లాంటిది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది మరింత అందంగా మారుతుంది. ఈ రోజు వాటర్ టెంపుల్ కి ఎలా చేరుకోవాలి? ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకమైనదో తెలుసుకుందాం.

Water Temple: ఈ సీజన్ లో ప్రకృతి, సంస్కృతిల అందమైన సంగమం వాటర్ టెంపుల్.. ఎక్కడంటే..
Neerputhoor Shiva Mandir
Surya Kala
|

Updated on: Jul 06, 2025 | 11:42 AM

Share

కేరళను సందర్శించడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తారు. దీనికి కారణం మున్నార్ కొండల నుంచి అల్లెప్పీ బ్యాక్ వాటర్స్, తెక్కడి వన్యప్రాణులు, కొచ్చి చరిత్ర, వర్కల అందమైన బీచ్ , వయనాడ్ పచ్చదనం వరకు… ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అందం జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో ఇక్కడ పచ్చదనం విస్తరిస్తుంది. ఇది కేరళ అందాన్ని మరింత పెంచుతుంది. చాలా మంది ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా కేరళను కూడా సందర్శిస్తారు. అయితే ఎక్కువ మందికి పద్మనాభస్వామి ఆలయం, గురువాయుర్ ఆలయం వంటి కొన్ని పెద్ద దేవాలయాల గురించి మాత్రమే తెలుసు. అయితే కేరళలోని వాటర్ టెంపుల్ కూడా చూడాల్సిన ఆలయమే. ముఖ్యంగా వర్షాకాలంలో ఆధ్యాత్మిక, సహజ సౌందర్యాల అద్భుతమైన సంగమం ఇక్కడ కనిపిస్తుంది.

కేరళను “దేవుని సొంత దేశం” అని కూడా పిలుస్తారు. విష్ణువు అవతారమైన పరశురాముడు కేరళను సృష్టించాడని.. అందుకే దీనిని దేవుని భూమిగా పిలుస్తారని నమ్ముతారు. ఇక్కడి దేవాలయాలు, పచ్చదనం అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఎవరైనా సహజ సౌందర్యంతో పాటు సాంస్కృతిక గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక శాంతిని అనుభవించాలనుకుంటే కేరళను సందర్శించవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి ఆలయాన్ని చూడడం ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రోజు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

వాటర్ టెంపుల్ ఎలా ఉంటుందంటే కేరళలోని నీటి ఆలయం లేదా జల మందిరం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, ప్రకృతి, సంస్కృతిల అందమైన సంగమం కూడా. ఈ ఆలయ పైకప్పుపై వర్షపు చినుకులు పడినప్పుడు ఆలయం చుట్టూ ఉన్న నీటి మట్టం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఇక్కడికి వెళ్తే.. ఆ అనుభవం స్వర్గాన్ని చూశామా అనిపిస్తుంది. వర్షాకాలంలో కేరళను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ నీటి ఆలయాన్ని మీ బకెట్ జాబితాలో చేర్చుకోండి. ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణం కూడా ఆకర్షిస్తుంది.

ఈ నీటి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే కేరళలోని ఈ నీటి ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం అన్ని వైపులా నీరు ఉంటుంది. వర్షాకాలంలో, ప్రాంగణంలో ప్రతిచోటా నీరు కనిపిస్తుంది. ఇక్కడి పచ్చని వాతావరణం అందాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. దీనిని శ్రీ నీరుపుత్తూరు మహా దేవ ఆలయం అని పిలుస్తారు. ఇది కేరళలోని మలప్పురం జిల్లాలోని పుతూర్ గ్రామంలో ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ నీరు సహజ వనరుల నుంచి వస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

నీర్పుతూర్ మహాదేవ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే కేరళ అన్ని ప్రధాన ప్రదేశాలతో అనుసంధానించబడి ఉం. మీ సౌకర్యాన్ని బట్టి రైలు, రోడ్డు లేదా విమాన మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. తిరూర్ రైల్వే స్టేషన్ ఆలయానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఆలయానికి దూరం 60 కి.మీ. మీరు ఆలయం నుంచి 25 కి.మీ దూరంలో ఉన్న పెరింతల్మన్న బస్ డిపోలో దిగవచ్చు, తరువాత ఈ ఆలయానికి స్థానిక వాహనం ద్వారా చేరుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్వీట్ కార్న్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
స్వీట్ కార్న్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్
లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్
ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారు..
ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారు..
చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్..రెండో మహిళా క్రికెటర్‌గా ఘనత
చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్..రెండో మహిళా క్రికెటర్‌గా ఘనత
ఏంటి రష్మిక.. బుంగమూతి పెట్టుకొని అలా చూస్తున్నావు..
ఏంటి రష్మిక.. బుంగమూతి పెట్టుకొని అలా చూస్తున్నావు..
ఏం అందంరా బాబు.. చీరలో ఐశ్వర్య అందం చూస్తే మతి పోవాల్సిందే!
ఏం అందంరా బాబు.. చీరలో ఐశ్వర్య అందం చూస్తే మతి పోవాల్సిందే!
జిమ్ తర్వాత చల్లటి నీటితో స్నానం.. ఆరోగ్యానికి మంచిదేనా..?
జిమ్ తర్వాత చల్లటి నీటితో స్నానం.. ఆరోగ్యానికి మంచిదేనా..?
లార్ట్స్ టెస్టులో ఎవరిది పై చేయి..గణాంకాలు ఏం చెబుతున్నాయంటే ?
లార్ట్స్ టెస్టులో ఎవరిది పై చేయి..గణాంకాలు ఏం చెబుతున్నాయంటే ?
హాస్పిటాలిటీ రంగం దూసుకుపోతున్న హోటల్ మేనేజ్‌మెంట్
హాస్పిటాలిటీ రంగం దూసుకుపోతున్న హోటల్ మేనేజ్‌మెంట్