పొగమంచు కమ్మేస్తోంది.. సేఫ్ డ్రైవింగ్ కోసం పాటించాల్సిన టిప్స్ ఇవే
Samatha
24 December 2025
చలికాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఉదయాన్నే పొగమంచు చుట్టి వేయడంతో చాలా మంది డ్రైవింగ్ చేసే సమయంలో ఇబ్బందులకు గురి అవుతుంటారు.
అయితే చలికాలంలో దట్టమైన పొగమంచులో సేఫ్‌గా డ్రైవింగ్ ఎలా చేయాలి? ఈ సమయంలో పాటించాల్సిన టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
పొగ మంచు రోడ్డు మొత్తం నిండి ఉంటుంది కాబట్టి, మీకు ఎదురుగా వచ్చే వాహనాలు, రోడ్డు సరిగా కనిపించదు. అందువలన చాలా తక్కువ వేగంతో డ్రైవ్ చేయడం మంచిది.
అదే విధంగా పొగమంచు కారణంగా కొన్ని సార్లు మీకు సడెన్ బ్రేక్ వేయాల్సి రావచ్చు. అందువలన మీకు ముందున్న వాహనానికి కాస్త దూరం మెంటైన్ చేయడం మంచిది.
రోడ్డు మొత్తం పొగమంచుతో ఉంటుంది కాబట్టి, పెద్ద పెద్ద లైటింగ్ అనేది కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు, అందువలన ఫాలైట్స్, తక్కువ వెలుతురునిచ్చే లైట్స్ ఉపయోగించాలి.
మీరు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో మీ ముందు విండ్ స్క్రీన్, సైడ్ మిర్రర్స్ పూర్తిగా మంచుతో మసకబారి ఉంటాయి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి.
శీతాకాలంలో చాలా వరకు ఉదయం ప్రయాణం మంచిది కాదు, కాబట్టి, అత్యవసరం అయితే తప్ప ఉదయం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.
పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వలన ప్రమాదం జరగచ్చు. అందువలన బ్రేకులు వేసేటప్పుడు జాగ్రత్త అవసరం.