చాణక్య నీతి : వీరితో డేంజర్..సైలెంట్‌తోనే చంపేస్తారు!
Samatha
24 December 2025
ఆ చార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడైన గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతుల సంపాదించుకున్నాడు. ఈయన గొప్ప గురువు.
చాణక్యుడు ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే వ్యక్తులు చాలా ప్రమాద
కరం అని ఆయన తెలియజేశారు.
ఏ వ్యక్తి అయితే ఎప్పుడూ ప్రశాంతంగా , ఎక్కువ మాట్లాడకుండా ఉంటారో, వారు చాలా తెలివైన వారు, వీరు సైలెంట్‌తో అన్నీ జయిస్తారని చెబుతున్నాడు చాణక్యుడు..
నిశ్శబ్దంగా కనిపించే వ్యక్తులు తమ బలహీనతలను వెల్లడించరు, కానీ ఇతరుల బలాలు బలహీనతలు తెలుసుకొని జాగ్రత్త పడుతుంటారు.
అదేవిధంగా ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే వారు పాము కంటే డేంజర్, వీరు ఎప్పుడు ఏ వ్యూహం రచిస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు.
ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే వ్యక్తులు తమ భావోద్వేగాలను త్వరగా వ్యక్తపరచరు. అందువలన వీరికి గురించి ఇతరులకు తెలియకుండ
ా ఉంటారు.
తెలివైన వ్యక్తుల చాలా మందు చూపుగా వ్యవహరిస్తారు. వీరు ఎప్పుడూ జీవితంలో ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
అలాగే నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు తమ ప్రణాళికలను ఎవరితోనూ చర్చించరని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. వారు మాటల కంటే ఆచరణ
ను ఎక్కువగా నమ్ముతారంట.