Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea Benefits: ఈ సీజన్ లో శరీరం హైడ్రేట్ గా ఉంచేందుకు ఈ టీ చేర్చుకోండి.. ఎన్ని ప్రయోజనాలంటే

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అయితే తరచుగా ప్రజలు వర్షం, తేమతో కూడిన వాతావరణం ఉన్న సమయంలో గ్రీన్ టీ తాగడం మంచిదా.. ఈ గ్రీన్ టీని వర్షాకాలంలో తాగాలా వద్దా అని ఆలోచిస్తుంటే.. ఈ రోజు నిపుణుల చెప్పిన సమాధానం తెలుసుకుందాం.

Green Tea Benefits: ఈ సీజన్ లో శరీరం హైడ్రేట్ గా ఉంచేందుకు ఈ టీ చేర్చుకోండి.. ఎన్ని ప్రయోజనాలంటే
Greentea Benefits
Surya Kala
|

Updated on: Jul 06, 2025 | 11:07 AM

Share

వర్షాకాలంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. వేడి తేమతో కూడిన వాతావరణంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం అతిపెద్ద అవసరం. అటువంటి పరిస్థితిలో ప్రజలు అనేక రకాల ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. వాటిలో గ్రీన్ టీ కూడా ఒక ప్రసిద్ధ ఎంపికగా మారింది. బరువు తగ్గడం నుంచి డీటాక్స్ వరకు గ్రీన్ టీని ఆరోగ్య నిధిగా పరిగణిస్తారు. అయితే వర్షాకాలంలో గ్రీన్ టీ తాగడం నిజంగా సరైనదేనా? అని ఆలోచిస్తారు. వర్షం, తేమ, ఎండలు వంటి విభిన్నమైన వాతావరణంలో గ్రీన్ టీ తాగాలా వద్దా? తాగితే దానిని ఏ సమయంలో? ఎంత పరిమాణంలో తీసుకోవడం సురక్షితం? తెలుసుకుందాం..

ఈ సీజన్ లో గ్రీన్ టీ తాగాలా వద్దా?

ఢిల్లీలోని పట్పర్‌గంజ్‌లోని మాక్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ మీనాక్షి జైన్ ఏ సీజన్ అయినా సరే శరీరంలో ద్రవాల అవసరం ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో దాహం తక్కువగా ఉంటుంది కనుక శరీరంలో తేమని నిర్వహించేందుకు ద్రవ పదార్ధాలను తీసుకోవడం తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో సాధారణ టీ, కాఫీ తీసుకోవడం కంటే గ్రీన్ టీ తీసుకుంటే శరీరంలో ద్రవం పరిమాణం పెరుగుతుంది. శరీరంలో ద్రవాలను పెంచడానికి గ్రీన్ టీ మంచిది. శరీరాన్ని డీహైడ్రేట్ బారిన పడకుండా చేస్తుంది.

ఏ పానీయాలు కూడా ప్రయోజనకరం అంటే

న్ టీతో పాటు తులసి టీ, తేనె, అల్లం టీ లేదా మరే ఇతర మూలికలతో తయారు చేసిన టీ తాగినా..ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సహజ పానీయాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కెఫిన్ నిర్జలీకరణానికి కారణమవుతుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. మరోవైపు గ్రీన్ టీలో శరీరంలో నిర్జలీకరణాన్ని పెంచే ఉత్పత్తులు ఉండవు. కనుక ఈ టీని ఏ సీజన్ లోనైనా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

  1. హెల్త్‌లైన్ ప్రకారం గ్రీన్ టీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. గ్రీన్ టీ ఆరోగ్యకరమైన, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పానీయం.
  2. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  3. గ్రీన్ టీని తాగడం వలన మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
  4. గ్రీన్ టీ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
  5. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసన, దంత సమస్యలను కూడా నివారిస్తాయి.
  6. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మంలోని మృత కణాలు తొలగిపోతాయి. వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. అయితే దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..