చేపలు వేయించేటప్పుడు ఉప్పు, పసుపు వేస్తున్నారా?

Samatha

22 December 2025

చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలు తింటుంటారు. కొంత మందికి చేపల కర్రీ ఇష్టం ఉంటే, మరికొంత మంది చేపల ఫ్రై ఇష్టపడుతుంటారు.

ముఖ్యంగా చేపలను వేయించి తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే చేపలు వేయించేటప్పుడు చాలా మంది పసుపు, ఉప్పు వేస్తుంటారు.

చాలా మందికి అసలు చేపలు వేయించేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తున్నారో? అసలు తెలియదు, కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

చేపలకు ఉప్పు, పసుపు కలిపి రాసి, వేయించడం వలన రుచి పెరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనంట.

చేపలకు ఉప్పు, లేదా పసుపు పూసి వేయించడం వలన వాటికి ఎక్కువగా నూనె పట్టకుండా ఉంటుందంట, అంతే కాకుండా నూనె వాడకం తగ్గుతుంది.

అంతే కాకుండా, పసుపు బ్యాక్టీరియాను చంపడంలో, ఉప్పు అనేది చేపలు చెడిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. అందుకే వీటిని తప్పకుండా రాస్తారు.

ముఖ్యంగా చేపలకు పసుపు రాయడం వలన ఇది వాటిపై ఉన్న బ్యాక్టీరియా మొత్తం నశించేలా చేసి, వాటిని ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చుతుంది.

అలాగే చేపలను శుభ్రం చేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి 20 నిమిషాలు అలాగే ఉంచడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.