చాణక్య నీతి : ఆఫీసుల్లో నష్టపోయేవారు వీరే.. అందులో మీరు ఉన్నారా?

Samatha

22 December 2025

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో విషయాల గురించి నీతిశాస్త్రం అనే పుస్తకం ద్వారా తెలియజేయడం జరిగింది.

అలాగే చాణక్యుడు ఆఫీసుల్లో నష్టపోయే ఐదు రకాల వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల గురించి తెలియజేయడం జరిగింది. వారు ఎవరో చూద్దాం.

కొంత మంది అర్హత, సామర్థ్యం ఉన్నా కూడా, ఆఫీసుల్లో మంచి పొజిషన్ పొందలేరు. అంతే కాకుండా వారు ఎప్పుడూ ఉన్నస్థానంలోనే ఉంటారు.

కొంత మంది మాత్రం చాలా త్వరగా గొప్ప పొజిషన్‌కు వెళ్తారు, దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నాడు చాణక్యుడు, అవి ఏవో తెలుసుకుందాం.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఎవరైతే  తమ బలహీనతలను ప్రతి ఒక్కరికీ తెలియజేస్తారో, వారు ఎప్పుడూ మంచి పొజిషన్‌లోకి వెళ్లలేరు.

అదే విధంగా, చాణక్యుడి ప్రకారం, అనవసరంగా మాట్లాడటం, ఇబ్బందులను ఆహ్వానిస్తుంది. అందుకే అనవసరంగా కాకుండా, అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి.

ఒక వ్యక్తి కోపం, భయం లేదా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఆఫీసులో తమను మంచి స్థానంలో నిలబెట్టలేవు.

అలాగే చాణక్యుడి ప్రకారం, కష్టపడి పని చేసినప్పటికీ, తమను తాము ప్రదర్శించుకోవడం కూడా చాలా అవసరం, దాని గురించి చెప్పలేని వారు సక్సెస్ అవ్వలేరు.