Viral Video: భారతీయ అలవాట్లు తెగ నచ్చేశాయి.. అత్తమామలతో జీవించడం ఒక వరం అంటున్న రష్యన్ యువతి..
కొంత మంది విదేశీయులు భారతీయుల అలవాట్లను వీలైనప్పుడల్లా విమర్శిస్తూ ఉంటారు. ఇటీవల ఓ అమెరికన్ ప్రముఖుడు చేతులతో ఆహారం తినే అలవాటు గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక రష్యన్ మహిళ భారతీయ అలవాట్ల గురించి ప్రస్తావిస్తూ.. అవి అంటే తనకు ఎందుకు ఇష్టమో కూడా వివరించింది. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరులో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ భారతీయ అలవాట్ల జాబితాను పంచుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఒకప్పుడు ఇవి తాను చిరాకు తెప్పించే అలవాట్లగా భావించినట్లు.. అయితే ఇప్పుడు పూర్తిగా సాధారణంగా, ప్రియమైనదిగా అనిపిస్తున్నాయని పేర్కొంది. ఒక భారతీయుడిని వివాహం చేసుకున్న కంటెంట్ సృష్టికర్త యూలియా ఈ జాబితాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవును భారతదేశంలో నివసిస్తున్న ఈ రష్యన్ మహిళ కొంతమంది బయటి వ్యక్తులు ‘వికారంగా’ భావిస్తున్న భారతీయుల అలవాట్లను సాధారణమైన భారతీయ సాంస్కృతిక అలవాట్లగా ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది. నెట్టింట్లో ఓ రేంజ్ లో ప్రశంసలను పొందుతుంది ఈ వీడియో.. దాదాపు ఆరు మిలియన్ల వ్యూస్ ని సంపాదించింది.
బెంగళూరులో స్థిరపడిన కంటెంట్ సృష్టికర్త యులియా భారతీయుడిని వివాహం చేసుకుంది. పూర్తిగా సాధారణ విషయాలు #russianindian” అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను పంచుకుంది. ప్రారంభంలో తనను ఆశ్చర్యపరిచిన ఎనిమిది భారతీయ పద్ధతులను జాబితాని వెల్లడించింది. అయితే ఇప్పుడు అవి తన దైనందిన జీవితంలో ఒకభాగం అయ్యాయని పేర్కొంది. ఈ పోస్ట్ కి భారతీయ వినియోగదారుల నుంచి భారీగా రెస్పాన్స్ గా వస్తుంది.
అత్తమామలతో కలిసి జీవించడం: తాను ఇప్పుడు అత్తమామలతో కలిసి జీవిస్తున్నానని.. ఇది తనకు ఒక వరం (కనీసం నేను నా కోసం కూడా ఇంట్లో విషయాలను అస్సలు నిర్వహించలేను కనుక)” అని ఆమె హృదయ ఎమోజితో రాసింది.
చేతులతో తినడం: చేతులతో ఆహారం తినడంతో తిన్న ఆహారం రుచిగా ఉంటుంది! (ఇది శాస్త్రీయ వాస్తవం కూడా),” అని ఆమె భారతదేశ సాంప్రదాయ భోజన శైలిని ప్రస్తావిస్తూ అన్నారు.
ఆలస్యంగా రావడం (కొంచెం): ప్రజలు 15-20 నిమిషాలు ఆలస్యంగా రావడం తనకు చాలా ఇష్టమని చెప్పింది. అయితే తన మీటింగ్స్ కి గ్యాప్ వచ్చే విధంగా ఈ అలవాటుని దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా తన పనులను ప్లాన్ చేసుకుంటాను,” అని ఆమె పంచుకుంది. సమయానికి తాను నిదానంగా చేరుకుంటానని.. ఈ విధానాన్ని అంగీకరించింది.
కుటుంబ సభ్యుల సహాయం: తనకు మొదట్లో ఈ పద్ధతి తనకు ఎలా అసాధారణంగా అనిపించిందని యులియా చెప్పింది. తనకు మొదట్లో ఈ అలవాటు చాలా వింతగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ సహాయం చేసే గుణంలో ఉన్న సౌలభ్యం తెలిసిందని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే.. కొంచెం సోమరితనంగా ఉండటం మానవ స్వభావమని చెప్పింది.
వివిధ భాషలతో పరిచయం: భారతదేశ భాషా వైవిధ్యానికి అనుగుణంగా ఆమె ఇలా చెప్పింది.. “నేను హింగ్లీష్‌లో అర్థాన్ని గ్రహించగలను. అయితే తాను వీలైనంత తొందరగా అంటే 1-2 సంవత్సరాలలో హిందీ నేర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది.
బేరాలు ఆడడం: భారతదేశంలో బేరాల సంస్కృతిని ప్రస్తావిస్తూ.. వ్యాపారంలో బేరం చేయడం ఒక ప్రభావవంతమైన కమ్యూనికేషన్ అని.. దీని నుంచి తాను చాలా నేర్చుకున్నాను. ఇది ఒక సూపర్ పవర్” అని చెప్పింది. భారతదేశం బేరసారాల సంస్కృతిని ఆమె అంగీకరించింది.
మసాలా చాయ్: టీ తాగడం కూడా భారతీయ సంస్కృతి కూడా జాబితాలో చోటు సంపాదించింది. పాలు, సుగంధ ద్రవ్యాలతో టీ కలపండి. అదొక అద్భుతమైన రుచి అని చెప్పినిడ్. తాను మంగోలియా సరిహద్దులో పుట్టానని చేబుతునే.. తప్పని సరిగా అబ్బాయిలు మసాలా చాయ్‌ని ప్రయత్నించండి అని సలహా ఇచ్చింది.
ప్రేమ ఒక జీవన విధానం: చివరిగా తనకు నచ్చిన లిస్టుని పూర్తి చేస్తూ భారతదేశంలో ప్రతిదీ ప్రేమ మయమే. ప్రతి సినిమా, ప్రతి సమస్య ప్రకటన ఏదో ఒక విధంగా ప్రేమతో ముడిపడి ఉంటుంది. భారతదేశం చాలా భావోద్వేగ దేశం. అది నాటకీయంగా మారనంత వరకు.. తనకు అది అద్భుతంగా అనిపిస్తుంది!” అని పేర్కొంది.
సోషల్ మీడియాలో భారతీయ సంప్రదాయాల అందాన్ని హైలైట్ చేస్తూనే వాటిని సున్నితంగా పది మంది ముందు వ్యక్తం చేసిన ఆమెను ప్రశంసించారు. భారతదేశం ప్రేమకు సంబంధించినదని అర్థం చేసుకుని ప్రపంచానికి పంచుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతికూల వ్యక్తులు ఉన్నారు. అయితే ప్రేమ భారతీయుల రక్తంలోనే ఉందని మరొకరు పేర్కొన్నారు. మరొక వినియోగదారు మీరు ప్రస్తావించిన అన్ని అంశాలు నాకు చాలా నచ్చాయి నేను భారతదేశం, నా కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నానని చెప్పాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..