Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tholi Ekadashi: ఈ రోజు గ్రహాల అద్భుత కలయిక.. అరుదైన యోగాలు.. ఈ పరిహారాలతో అదృష్టం మీ సొంతం

ఈ ఏడాది తొలి ఏకాదశి రోజున అనేక అద్భుతమైన యాదృచ్చికాలు జరుగుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ తొలి ఏకాదశి నాడు గురు ఆదిత్య యోగం, శుభ యోగం, సాధ్య యోగం, త్రిపుష్కర యోగంలతో పాటు రవి యోగం ఏర్పడబోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు చాలా ఫలవంతమైన రోజుగా పరిగణింపబడుతున్నది. ఈ రోజున ఈ పరిహారాలు చేయడం వలన శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి కోరిన కోర్కెలు తీరుస్తారని విశ్వాసం.

Tholi Ekadashi: ఈ రోజు గ్రహాల అద్భుత కలయిక.. అరుదైన యోగాలు.. ఈ పరిహారాలతో అదృష్టం మీ సొంతం
Tholi Ekadashi 2025
Surya Kala
|

Updated on: Jul 06, 2025 | 6:44 AM

Share

తొలి ఏకాదశిని ఈ రోజున జరుపుకుంటున్నారు. ఈ రోజు శ్రీ మహా విష్ణువు 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్లనున్నాడు. దీంతో ఈ రోజు భక్తులు చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగనిస్తారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వారికీ ఏకాదశి మహిమ గురించి బాగా తెలుసు. ఏకాదశి ఉపవాసంప్రాముఖ్యత వేదాలు, పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. అయితే ఈ రోజు అంటే తొలి ఏకాదశి రోజున అనేక శుభ యాదృచ్చికాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈసారి గురు ఆదిత్య యోగం ఏర్పడుతోంది. దీంతో పాటు శుభ యోగం, సాధ్య యోగం, త్రిపుష్కర యోగం, రవి యోగం కూడా ఏర్పడనుండడంతో ఈ తొలి ఏకాదశిని మరింత శుభప్రదం చేసింది.

ఈ రోజున శ్రీ మహా విష్ణువు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ రోజున ఈ దంపతుల ఆశీస్సులు పొందేందుకు ఐదు సాధారణ పరిహారాలను చేయాలనీ పండితులు సూచించారు. ఇలా చేయడం వలన అదృష్టం ప్రకాశవంతం అవుతుంది. ఈ నివారణలు చేయడం ద్వారా జీవితంలోని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతారు. తొలి ఏకాదశి నాడు ఉపవాసం, పూజలు చేయడం ద్వారా ప్రమాదాలు కూడా తొలగిపోతాయని చెబుతారు. ఈ రోజు చేయాల్సిన నివారణలు ఏమిటో తెలుసుకుందాం.

పసుపు రంగు దుస్తులు: ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. నీలం, నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. విష్ణువుని పీతాంబర ధరి అని పిలుస్తారు. అంటే విష్ణువు పసుపు రంగు దుస్తులను చాలా ఇష్టం. కనుక ఈ రోజున మీరు పసుపు రంగు దుస్తులు ధరించి దేవునికి పసుపు రంగు ఆహార పదార్ధాలను సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా విష్ణువు ఆశీస్సులు పొందుతారు.

ఇవి కూడా చదవండి

కుంకుమ: లక్ష్మీదేవికి కుంకుమ అంటే చాలా ఇష్టం. కుంకుమలో కూడా పసుపు ఉంటుంది. కనుక ఇది విష్ణువుకు కూడా ప్రియమైనది. ఈ రోజున ఒక చిన్న గిన్నెలో కొంచెం కుంకుమ వేసి తర్వాత కొంచెం గంగాజలం, కొంత రోజ్ వాటర్, కొంత గంధం వేసి ఉంగరపు వేలుతో కుంకుమని కలపండి. ఇలా రెడీ అయిన ఈ తిలకాన్ని మీ నుదిటిపై ధరించండి. ఈ పరిహారం చేయడం ద్వారా బృహస్పతి అనుగ్రహం కూడా లభించి శుభ ఫలితాలను కూడా ఇస్తాడని నమ్మకం.

తులసి పూజ: ఈ రోజున తులసిని పూజించండి. తులసి విష్ణువుకు ఇష్టమైనది. ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ రోజున తల్లి తులసిని పూజించడం ఆచారం. ఆమెను పూజించి, దేశీ నెయ్యితో దీపం వెలిగించి, తులసిని 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

గులాబీ పువ్వులు: ఈ రోజున మీరు విష్ణువుకు పసుపు పువ్వులు, లక్ష్మీ దేవికి గులాబీ పువ్వులు లేదా మందారం పువ్వులను సమర్పించాలి. ఈ వాడిపోకూడదని గుర్తుంచుకోండి.

నాలుగు ముఖాల దీపం: ఈ రోజుసాయంత్రం సంధ్యా సమయంలో నాలుగు ముఖాల దీపాన్ని తయారు చేసుకుని ఆ పిండి దీపంలో పత్తి దారంతో చేసిన వత్తులను ఉంచండి. ఆవు నెయ్యితో నింపండి. సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో వచ్చే సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.