AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Planet Stays Time: నవ గ్రహాల్లో ఏ గ్రహం ఏ రాశిలో ఎన్ని రోజులు ఉంటుంది? ఏ గ్రహం వేగంగా చంచరిస్తుంది? ఏది మందగమనం గలదో తెలుసా..

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాలు సంచరిస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఒక గ్రహం ఒక నిర్దిష్ట రాశిలోకి ప్రవేశించినప్పుడు లేదా దానితో సంబంధాన్ని ఏర్పరుచుకున్నప్పుడు.. ఆ గ్రహం ఆ రాశి, దానితో సంబంధం ఉన్న వ్యక్తులను దాని స్వభావాన్ని బట్టి ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం శుభప్రదంగా లేదా అశుభకరంగా ఉంటుంది. ఇది జాతకంలో గ్రహం ఏ ఇంట్లో ఉంది? దాని స్థానం ఏమిటి? అది ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నవ గ్రహాల్లో ఏ గ్రహం ఏ రాశిలో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా..

Planet Stays Time: నవ గ్రహాల్లో ఏ గ్రహం ఏ రాశిలో ఎన్ని రోజులు ఉంటుంది? ఏ గ్రహం వేగంగా చంచరిస్తుంది? ఏది మందగమనం గలదో తెలుసా..
Astrology Transit Guide
Surya Kala
|

Updated on: Jun 23, 2025 | 5:13 PM

Share

జ్యోతిషశాస్త్రంలో ఒక రాశి నుంచి మరొక రాశికి గ్రహాల సంచారం (అంటే కదలిక) నిరంతరం జరుగుతుంది. ప్రతి గ్రహానికి దాని సొంత వేగం ఉంటుంది. దీని కారణంగా అవి వేర్వేరు కాలాల పాటు ఒకే రాశిలో ఉంటాయి. ఈ గ్రహ సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. గ్రహాల సంచారం కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని రాశులకు ఇబ్బందులకు కారణమవుతుంది. ఏ గ్రహం ఏ రాశిలో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసుకుందాం?

రాశులో ఉండే గ్రహాల సమయం

  1. సూర్యుడు ఒక రాశిలో సంచరిస్తున్నప్పుడు.. ఆ రాశిలో దాదాపు 1 నెల (30 రోజులు) ఉంటుంది. సూర్యుడు ఆత్మ, తండ్రి, గౌరవం, ప్రభుత్వ రంగం, ఆత్మవిశ్వాసానికి కారకుడు. సూర్యుడి సంచారము ప్రతి నెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంది.
  2. చంద్రుడు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు.. దాదాపు రెండున్నర రోజులు (సుమారు 54 గంటలు) అదే రాశిలో ఉంటాడు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, తల్లి , శీఘ్ర ఆలోచనలకు కారకుడు. చంద్రుడు నవ గ్రహాల్లో అత్యంత వేగంగా కదిలే గ్రహం. కనుక తక్కువ సమయంలోనే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు.
  3. కుజుడు ఒక రాశిలో దాదాపు 45 నుంచి 57 రోజులు ఉంటాడు. కుజుడు శక్తి, ధైర్యం, భూమి, సోదరుడు, కోపానికి కారకుడు.
  4. బుధుడు ప్రతి రాశిలో దాదాపు 25 నుంచి 30 రోజుల పాటు సంచరిస్తాడు. బుధుడు తెలివితేటలు, వాక్కు, కమ్యూనికేషన్, వ్యాపారం, తర్కానికి కారకుడు. బుధుడి కదలిక సూర్యుని చుట్టూ ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. శుక్రుడు ఒక రాశిలో దాదాపు 23 నుంచి 30 రోజులు ఉంటాడు. ప్రేమ, అందం, భౌతిక సుఖాలు, కళ , వైవాహిక జీవితానికి శుక్రుడు కారకుడు.
  7. బృహస్పతి (గురువు) ఒక రాశిలో దాదాపు 1 సంవత్సరం (12 నెలలు) ఉంటాడు. బృహస్పతి జ్ఞానం, మతం, అదృష్టం, సంపద, గురువులకు కారకుడు. ఈ గ్రహం గమనం నెమ్మదిగా జరుగుతుంది. తక్కువ వేగం కారణంగా బృహస్పతి ఒక రాశిలో ఎక్కువ కాలం అంటే ఒక ఏడాది ఉంటాడు.
  8. శనీశ్వరుడు నవ గ్రహంల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. అందుకనే శనిశ్వరుడిని మందగమనుడు అని అంటారు. శనీశ్వరుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు (2.5 సంవత్సరాలు) ఉంటాడు. శనీశ్వరుడు కర్మ, క్రమశిక్షణ, న్యాయం, వయస్సు, దుఃఖం, సేవకు కారకుడు. ఇది నెమ్మదిగా కదిలే గ్రహాలలో ఒకటి.
  9. రాహువు, కేతువు : ప్రతి రాశిలో దాదాపు 18 నెలలు (ఒకటిన్నర సంవత్సరాలు) సంచరిస్తారు. రాహువు ,కేతువులు ఛాయా గ్రహాలు. ఎల్లప్పుడూ తిరోగమనం (రివర్స్) లో కదులుతారు. రాహువు భ్రమ, విదేశీ సంబంధాలు , ఆకస్మిక సంఘటనలకు సూచిక అయితే.. కేతువు ఆధ్యాత్మికత, ఒంటరితనం ,అంతర్ దృష్టికి సూచి. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు , కేతువు 18 సంవత్సరాల కక్ష్య చక్రం కలిగి ఉంటారు, ఎల్లప్పుడూ ఒకదానికొకటి 180 డిగ్రీలు కక్ష్యలో ఉంటారు

ఈ కాలాలు సగటున ఉంటాయి. గ్రహాలు తిరోగమనం లేదా ప్రత్యక్షంగా ఉండటం వల్ల వాటి వేగంలో స్వల్ప మార్పు ఉండవచ్చు. గ్రహాల సంచారం జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అవి.. అవి వెళ్ళే రాశికి సంబందించిన శక్తిని ప్రభావితం చేస్తాయి. సంబంధిత రాశికి చెందిన వ్యక్తులపై శుభ లేదా అశుభ ప్రభావాలను చూపుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..