AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

చార్ ధామ్ యాత్ర హిందూ మతంలో చాలా పవిత్రమైనది. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు.. భక్తుల జీవితాల్లో మార్పులను తీసుకువచ్చే ఆధ్యాత్మిక అనుభవం. భారతదేశంలో ప్రధానంగా రెండు రకాల చార్ ధామ్ యాత్రలు ప్రబలంగా ఉన్నాయి. రెండింటికీ వాటి సొంత ప్రాముఖ్యత ఉంది.

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..
Char Dham Yatra
Surya Kala
|

Updated on: Jun 23, 2025 | 3:14 PM

Share

హిందూ మతంలో చార్ ధామ్ యాత్ర అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రయాణం శారీరకంగానే కాదు మానసిక, ఆధ్యాత్మిక బలాన్ని కూడా పరీక్షిస్తుంది. ఈ ప్రయాణం చేయడం ద్వారా ప్రజలు అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. హిందూ మతంలో ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర ధామ్‌లను సందర్శించడం ద్వారా.. ఒక వ్యక్తి జన్మజన్మలలో పేరుకుపోయిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయడం వలన తెలిసి లేదా తెలియకుండా చేసిన తప్పుల నుంచి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఈ యాత్ర ఆత్మను శుద్ధి చేస్తుంది. ఇది మనసుకు శాంతిని ఇస్తుంది. వ్యక్తి ఆధ్యాత్మికంగా తేలికగా ఉంటాడు.

హిందూ మతంలో చార్ ధామ్ యాత్రను మోక్షం (జీవన మరణ చక్రం నుండి విముక్తి) పొందడానికి ప్రత్యక్ష మార్గంగా పరిగణిస్తారు. ముఖ్యంగా బద్రీనాథ్ గురించి ఒక నమ్మకం ఆంది.. ఎవరైతే బద్రీనాథ్‌కు వెళ్తాడో వారికి మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు అనే సామెత ప్రాచుర్యం పొందింది. కేదార్‌నాథ్ గురించి, కేదార్‌నాథ్ జ్యోతిర్లింగాన్ని పూజించి, అక్కడ ఉన్న నీటిని తాగితే పునర్జన్మ పొందరని శివ పురాణంలో చెప్పబడింది.

చార్ ధామ్ యాత్ర: భారతదేశంలో రెండు రకాల చార్ ధామ్ యాత్రలు ప్రసిద్ధి చెందాయి.

  1. బద్రీనాథ్ (ఉత్తరాఖండ్) – విష్ణువుకు అంకితం చేయబడింది.
  2. ద్వారక (గుజరాత్) – శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది.
  3. ఇవి కూడా చదవండి
  4. పూరి (ఒరిస్సా) – జగన్నాథ (కృష్ణుడు) కి అంకితం చేయబడింది.
  5. రామేశ్వరం (తమిళనాడు) – శివునికి అంకితం చేయబడింది.

చోటా చార్ ధామ్ ఉత్తరాఖండ్‌లో ఉంది.

  1. యమునోత్రి – యమునా దేవికి అంకితం చేయబడింది.
  2. గంగోత్రి – గంగాదేవికి అంకితం చేయబడింది.
  3. కేదార్‌నాథ్ – శివుడికి అంకితం చేయబడింది.
  4. బద్రీనాథ్ – విష్ణువుకు అంకితం చేయబడింది.

దైవిక ఆశీర్వాదం, కృప

ఈ నాలుగు ధామాలలోనూ వివిధ దేవుళ్ళు, దేవతలు నివసిస్తారు. వాటిని సందర్శించడం ద్వారా సంబంధిత దేవతల ప్రత్యక్ష ఆశీర్వాదాలు పొందుతారు. ఇది జీవితంలో ఆనందం, శాంతి , శ్రేయస్సును తెస్తుంది. విష్ణువు, శివుడు, గంగా, యమునల పవిత్ర దర్శనం ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఈ ప్రయాణాలు తరచుగా దుర్గమమైన పర్వత మార్గాలు, క్లిష్ట వాతావరణ పరిస్థితుల ద్వారా చేయాల్సి ఉంటుంది. వీటిని విజయవంతంగా పూర్తి చేయడం వల్ల వ్యక్తి శారీరక ఓర్పు, మానసిక బలం, సంకల్ప శక్తి బాగా పెరుగుతుంది. ఈ ప్రయాణం భక్తులకు వారి శారీరక, మానసిక పరిమితులను అధిగమించి స్వీయ-ఆవిష్కరణ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.

అడ్డంకుల నుంచి విముక్తి

యాత్ర సమయంలో పవిత్ర స్థలాలలో పూజలు చేయడం, మంత్రాలు జపించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. జీవితంలోని అడ్డంకులు, ఇబ్బందులు తొలగిపోతాయి. చార్ ధామ్ యాత్ర సమయంలో స్వచ్ఛమైన , సహజ వాతావరణంలో సమయం గడపడం, నడవడం, సాత్విక జీవనశైలిని అవలంబించడం వల్ల వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘాయువు లభిస్తుంది. ఈ యాత్ర కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక పరివర్తన అనుభవం. ఇది ఒక వ్యక్తి తన అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి, జీవితపు నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

చార్ ధామ్ యాత్ర ఎందుకు ముఖ్యమైనది?

హిందువుల నమ్మకం ప్రకారం.. తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ నాలుగు పవిత్ర ధామాలను సందర్శించాలని భావిస్తారు. ఇది ఒక ముఖ్యమైన మతపరమైన విధిగా పరిగణించబడుతుంది. 8వ శతాబ్దపు గొప్ప తత్వవేత్త ఆది శంకరాచార్య ఈ నాలుగు ధామాలను స్థాపించి భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేశారు. ఈ ధామాలను సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన, ఐక్యత పెరుగుతుందని ఆయన నమ్మాడు. పురాణ గ్రంథాల ప్రకారం.. ఈ ప్రయాణం కర్మను శుద్ధి చేస్తుంది. ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక ప్రయాణం చేసేలా చేస్తుంది. ఈ ప్రయాణం భారతదేశపు గొప్ప సాంస్కృతిక, మత, పౌరాణిక వారసత్వాన్ని అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.